నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ సత్తా చాటుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. యూఎస్‌లో ప్రీమియర్లకు ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా సినిమా వచ్చిన పాజిటివ్ టాక్‌తో కలెక్షన్లు అమాంతం పెరిగిపోయాయి. ప్రీమియర్లతో పోలిస్తే శుక్రవారం వసూళ్లు 60 శాతం పెరగగా శనివారం 83 శాతం పెరగడం గమనార్హం. ప్రీమియర్లతో కలుపుకుని శనివారం వరకు ‘భీష్మ’ చిత్రం యూఎస్‌లో 523,900 వసూలు చేసింది. అంటే, ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 3.76 కోట్లు. దీనిలో ప్రీమియర్ల ద్వారా వచ్చింది 94,800 డాలర్లు (సుమారు రూ.68 లక్షలు). ఇక శుక్రవారం వసూలైన మొత్తం 151,700 డాలర్లు (దాదాపు రూ. 1.09 కోట్లు). శనివారం వసూలైంది 277,400 డాలర్లు (దాదాపు రూ. 1.99 కోట్లు). మొత్తంగా చూసుకుంటే సుమారు రూ.3.76 కోట్ల గ్రాస్‌ను యూఎస్‌లో ‘భీష్మ’ విడుదల చేసింది. ఇక ఆదివారం కూడా కలెక్షన్లు భారీగానే ఉంటాయి. ఓవర్‌సీస్‌లో ‘భీష్మ’ థియేట్రికల్ రైట్స్‌ను రూ.2.4 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఇప్పటికే సుమారుగా రూ.2 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైపోయింది. ఇక, ఆదివారం ముగిసేసరికి ఈ చిత్రం యూఎస్‌లో బ్రేక్ ఈవెన్‌ను దాటేయడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లోనూ ‘భీష్మ’ కాసుల వర్షం కురిపిస్తోంది. శనివారం ముగిసే సరికి ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 10.52 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. ఆదివారం కూడా హౌస్‌ఫుల్ షోలతో అదరగొడుతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32mx4b7
No comments:
Post a Comment