Sunday, 23 February 2020

తలకి నూనె రాసి బయటికి వెళ్తున్నారా..

జుట్టుకి .. తల బాగా నొప్పిగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆయిల్‌తో మసాజ్ చేయండి. దీని వల్ల కొద్దిసేపటికే మొత్తం తలనొప్పి తగ్గిపోతుంది. నరాలు కూడా చాలా రిలాక్స్‌గా ఉంటాయి. చాలా ఉపశమనంగా ఉంటంది. ఇలా మసాజ్ చేయడం వల్ల కేవలం తలపై మాత్రమే కాదు, శరీరంపై కూడా ఆ ప్రభావం ఉంటుంది. అందుకే చాలా మంది కూడా డబ్బులు పెట్టి మరీ మసాజ్ చేయించుకుంటారు. కొన్ని చోట్ల అయితే కేవలం మసాజ్ కోసమే బ్యూటీపార్లర్స్, ఇతర ప్రత్యేకమైన స్పాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిడిగా భావించే వారు అక్కడికి వెళ్లి మసాజ్ చేయించుకుంటారు. దీని వల్ల చాలా వరకూ ఒత్తిడి అనే సమస్యే దరిచేరదు. నూనె రాయడం వల్ల కలిగే లాభాలు.. నూనె రాయడం అంటే ఇప్పుడు ఏదో జిడ్డుగా ఉంటుంది.. అసలు తలకి నూనె రాసి బయటికి వెళ్తారా ఏంటి అని అంటారు. కానీ, నూనె రాయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇలా నూనె రాయడం వల్ల జుట్టుకి పోషణ అందుతుంది. జుట్టు కూడా బలంగా పెరుగుతుంది. మృదువుగా, అందంగా, బలంగా ఉంటుంది. చాలా వరకూ జుట్టు సమస్యలు ఎదుర్కొనేవారిలో నూనె రాయకపోవడమే ప్రధాన కారణంగా ఉంటుంది. నూనె రాసి బయటికి వెళ్తే.. అయితే, ఇక్కడ మరో ముఖ్య విషయం మీరు తలకి నూనె రాయలనుకున్నప్పుడు ముందురోజు రాత్రి.. లేదా తలస్నానానికి ముందు రాయాలి. ఇలా రాయడం చాలా మంచిది. మరి కొంతమంది తలస్నానం చేసిన వెంటనే నూనె రాస్తారు. కానీ, ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే.. దుమ్ముని ఆకర్షించే గుణం నూనెకి ఎక్కువగా ఉంటుంది. మనం తలకి నూనె రాసి బయటికి వెళ్లాలనుకున్నప్పుడు బయట ఉండే దుమ్ము, ధూళి తలని పట్టేస్తాయి. కాబట్టి.. అలా ఎప్పుడు చేయకూడదు. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ముందుకాలంలో ప్రతి ఒక్కరూ నూనె రాసేవారు. ఇంత కాలుష్యం ఉండేది కాదు.. మంచి ఆహారం తీసుకునేవారు. ఒత్తిడి కూడా పెద్దగా ఉండేది కాదు. అందుకే వారు ఎలాంటి జుట్టు రాలే సమస్యలతో బాధపడేవారు కాదు. కానీ, ఇప్పుడు ఫ్యాషన్ అంటూ తలకి నూనె రాయకపోవడం, కాలుష్యం, ఏవేవో షాంపూలు రాయడం, కలరింగ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఈ కారణాలన్నింటితో ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి అలాంటి వాటికి చెక్‌పెట్టి అలవాటు చేసుకోండి. జుట్టు సమస్యలను దూరం చేసుకోండి. వీటితో పాటు సరైన ఆహారం, నిద్ర, ఒత్తిడి దరచేరకుండా చూడడం, వ్యాయామం వంటివన్నీ కూడా అందమైన జుట్టు కోసం చేసే ప్రయత్నాలని మరిచిపోకూడదు. ఇలాంటి చిట్కాలన్నీ పాటించండి. మీ జుట్టు సమస్యలను చాలా వరకూ దూరం చేసుకోండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/3a8W7l1

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...