Sunday, 23 February 2020

నాని ఒక డాక్టర్‌ని డైరెక్టర్ చేసేశాడు.. ‘హిట్’ అవుతుందనే ఆ పేరు పెట్టాడు

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి ‘అ!’ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఒక వైవిధ్యమైన చిత్రంగా ‘అ!’ను నిర్మించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తన రెండో ప్రయత్నంగా ‘హిట్’ సినిమాను నిర్మించారు. ‘ఫలక్‌నుమా దాస్’ ఫేమ్ విశ్వక్‌సేన్‌ను హీరోగా, రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించారు. ‘ది ఫస్ట్ కేస్’ అన్నది ట్యాగ్ లైన్. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈనెల 28న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, దర్శకధీరుడు రాజమౌళి, అనుష్క ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రీ రిలీజ్ వేడుకలో కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘‘అ’ సినిమాతో నాని నిర్మాతగా మారి నేర్చుకున్నాడు.. ఇప్పుడు ‘హిట్‌’ అంటున్నాడు. ఎంత నమ్మకం లేకపోతే ఆ పేరు పెడతాడు. చాలా సినిమాలు చేశాడు కదా.. కొన్ని ఆడతాయి, మరికొన్ని ఆడవు. ఆడని వాటిలోని తప్పులు.. ఆడిన వాటిలోని బెస్ట్‌లు తీసుకుని ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ‘హిట్‌’ అని పేరు పెట్టే్శాడు. మొత్తంగా ఓ డాక్టర్‌(శైలేశ్‌)ని డైరెక్టర్‌ చేశాడు నాని’’ అని అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకి చేస్తున్న అన్నీ చాలా బాగున్నాయి. టీజర్‌, ట్రైలర్‌ స్టైలిష్‌గా ఉన్నాయి. ‘స్నీక్‌పీక్’ అనే ఐడియా నాకు చాలా నచ్చింది. ఇలాంటి ఆలోచన నేను తొలిసారి ఇంగ్లిష్ సినిమా ‘2012’కి సంబంధించి చూశాను. సినిమాలోని చాలా ముఖ్యమైన, కీలక సన్నివేశాన్ని ముందే విడుదల చేసేశారు. అయితే, ఆ తరవాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీతో అందరూ థియేటర్లకు వెళ్లారు. అది చాలా మంచి ఐడియా. అలాంటి ఐడియాతోనే ‘హిట్’లో కూడా ఓ కీలక ఘట్టాన్ని విడుదల చేశారు. ఈ సినిమా తప్పకుండా హిట్టవ్వాలి. ‘ది ఫస్ట్‌కేస్‌’ అని ఉపశీర్షిక పెట్టారు. సెకండ్‌ కేస్‌, థర్డ్‌ కేస్‌ అంటూ మరిన్ని కేసులతో ఈ సినిమా మంచి ఫ్రాంచైజ్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. అనుష్క మాట్లాడుతూ.. ‘‘ఈరోజు నేను ఇక్కడికి అతిథిగా రాలేదు. నాని, ప్రశాంతి నా కుటుంబసభ్యులే. ‘అ!’ చాలా మంచి సినిమా. రెండో సినిమా చాలా మంచి కథతో వస్తారనుకుని వేచి చూశా. అదే జరిగింది. ‘హిట్‌’ ట్రైలర్స్, పాటలు బాగున్నాయి. అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ అందరికీ బాగా రీచ్ అయ్యింది. సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి. నాని ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. హీరో అయినప్పటికీ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నాడు. అలాంటి నాని బ్యానర్‌కి సక్సెస్‌ కావాలి. అలాగే, డైరెక్టర్ మా శేషగిరిరావు గారి అబ్బాయి.. శైలేష్‌కి, విశ్వక్‌సేన్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత ప్రశాంతి, డైరెక్టర్‌ నందినీ రెడ్డి, హీరోలు రానా, నవదీప్, సందీప్‌ కిషన్, ‘అల్లరి’ నరేశ్, సునీల్, కార్తికేయ, నటి మంచు లక్ష్మి, నటులు భానుచందర్, రాహుల్‌ రామకృష్ణ, రవివర్మ, నిర్మాతలు రాజ్‌ కందుకూరి, బెక్కం వేణుగోపాల్, సంగీత దర్శకులు కీరవాణి, వివేక్‌ సాగర్, కాలభైరవ, కెమెరామేన్‌ మణికందన్, ఎడిటర్‌ గ్యారీ, డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ పాల్గొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HLs5Yi

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...