నేచురల్ స్టార్ నాని తాను హీరోగా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ మారారు. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్‌ను స్థాపించి ఆయన నిర్మించిన తొలి చిత్రం ‘అ!’. ఈ చిత్రం ద్వారా యంగ్ టాలెంటెడ్ ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశారు. వైవిధ్యమైన కథాంశంతో వచ్చిన ‘అ!’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు, నానికి నిర్మాతగానూ మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే, ఈ చిత్రానికి మంచి పేరు వచ్చినా కమర్షియల్‌గా హిట్ కాలేదని, డబ్బులు రాలేదని ఇప్పటికీ అంటుంటారు. ఈ విమర్శలపై తాజాగా నాని స్పందించారు. నాని నిర్మాతగా వస్తోన్న రెండో చిత్రం ‘హిట్’. ‘ఫలక్‌నుమా దాస్’ ఫేమ్ విశ్వక్‌సేన్ హీరోగా నటించారు. రుహానీ శర్మ హీరోయిన్. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చిత్రంపై ఆసక్తిని పెంచింది. ఇక ప్రేక్షకుల మనన్ననలు అందుకోవడానికి ఈనెల 28న ‘హిట్’ విడుదలవుతోంది. ఈ క్రమంలో ఆదివారం ‘హిట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. కె.రాఘవేంద్రరావు, ఎస్.ఎస్.రాజమౌళి, అనుష్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకలో భాగంగా నాని మాట్లాడుతూ.. ‘హిట్’ సినిమాను ఫస్ట్ తానే హీరోగా చేద్దామని అనుకున్నారట. కానీ, విశ్వక్ అయితే బాగుంటుందని అనిపించి తన ఆలోచనను మార్చుకున్నానని నాని చెప్పారు. ‘‘శైలేష్ చెప్పిన కథల్లో ‘హిట్’ వెంటనే తీయాలనిపించింది. ఆయన చాలా తెలివైనవాడు. కెరీర్ వదిలిపెట్టి సినిమాల్లోకి వస్తుంటే వాళ్ల నాన్నగారు శేషగిరిరావుగారు చాలా భయపడ్డారు. నేను కూడా మొదటల్లో డాక్టర్ ఉద్యోగం వదలొద్దని చెప్పేవాణ్ణి. జాబ్ సెక్యూరిటీ ఉంచుకోమనేవాణ్ణి. ఈరోజు చెబుతున్నా ఉద్యోగానికి రిజైన్ చేసే.. పర్లేదు’’ అని నాని వెల్లడించారు. Also Read: ‘ఫలక్‌నుమాదాస్’లో విశ్వక్ ఆ పాత్రకు సరిపోయాడని.. ‘హిట్’ సినిమా చూశాక ఏ పాత్ర అయినా ఇరగదీస్తాడనే నమ్మకం కలిగిందని నాని కొనియాడారు. విశ్వక్ వెర్సటైల్ యాక్టర్ అన్నారు. ఇక ‘అ!’ సినిమా గురించి నాని మాట్లాడుతూ.. ‘‘అ! సినిమా బాగున్నా డబ్బులు రాలేదేమో? అని కొందరు రాస్తుంటారు. నిర్మాతగా నేను చెబుతున్నా.. ఆ సినిమా పక్కా కమర్షియల్ హిట్. ఈ నెల 28న ప్రేక్షకులకు ‘హిట్’ రూపంలో ఓ క్వాలిటీ, మంచి సినిమా ఇస్తున్నాం. ఇందుకు గర్వంగా ఉంది’’ అని క్లారిటీ ఇచ్చారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37PWaQP
No comments:
Post a Comment