ప్రపంచంలోనే నెంబర్ వన్ నెట్‌వర్క్ అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటుంది ఎయిర్‌టెల్ సంస్థ. బోలెడన్ని రీచార్జ్ ప్లాన్స్ ఉన్నాయంటూ తెగ మెసేజ్‌లు పంపిస్తుంటుంది. కానీ సినీ నటి పూజా హెగ్డేని మాత్రం ఎయిర్‌టెల్ సంస్థ సంతృప్తి పరచలేకపోయింది. ఎయిర్‌టెల్ కస్టమర్ సర్వీస్‌తో విసిగిపోయిన పూజ.. ట్విటర్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఎయిర్‌టెల్ సర్వీస్‌తో నేను విసిగిపోయాను. తప్పుడు బిల్లులు వేస్తుంటారు. చెత్త కస్టమర్ సర్వీస్. చెత్త వ్యవస్థ. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. ఈ సంస్థ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుని వేరే కెరీర్‌ను చూసుకోండి. నా జీవితంలో ఇంతటి చెత్త అనుభవం నాకెప్పుడూ ఎదురుకాలేదు’ అని మండిపడ్డారు. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ బిల్లులపై 50 శాతం టారిఫ్‌లను విధించింది. బహుశా దీనిపై పూజ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లున్నారు. అయితే ఈ ట్వీట్‌పై భారతి ఎయిర్‌టెల్ సంస్థ స్పందించింది. READ ALSO: ‘హాయ్ పూజ. మా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. త్వరలో మీ సమస్య తీరేలా చూస్తాం. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అయితే పూజ సెలబ్రిటీ కాబట్టి ఆమె ట్విటర్‌లో సమస్యను ట్వీట్ చేయగానే ఎయిర్‌టెల్ స్పందించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె సెలబ్రిటీ కాబట్టి వెంటనే స్పందించారని, అదే సమాన్య వ్యక్తి మెసేజ్ చేస్తే మాత్రం స్పందించరంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఎయిర్‌టెల్ సంస్థపై కామెంట్స్ చేయమని రిలయన్స్ పూజకు డబ్బు ఇచ్చినట్లుందని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38Yn1et
No comments:
Post a Comment