తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ తండ్రి అళగప్పన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. విజయ్, సినీ నటి కొన్నేళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లైన నాలుగేళ్లకే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కారణం అమల, విజయ్ చెప్పలేదు. పెళ్లి తర్వాత కూడా అమల సినిమాల్లో నటిస్తాను అన్నందుకు అత్తింటివారు ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. అయితే అమల, విజయ్ విడిపోవడానికి అసలు కారణం సూపర్‌స్టార్ రజినీకాంత్ అల్లుడు, సినీ నటుడు ధనుషేనంటూ అళగప్పన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. ‘అమల, విజయ్ విడిపోవడానికి కారణం ధనుషే. ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్ బార్ ఫిలింస్‌పై ‘అమ్మ కనక్కు’ అనే సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు. ఇందులో అమలా పాల్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అమలకు కూడా చెప్పాడు. అయితే పెళ్లి తర్వాత నటించకూడదని అమల నిర్ణయించుకుంది. సరిగ్గా అప్పుడే ధనుష్ ఈ ఆఫర్‌ను అమలకు ఇవ్వడంతో ఆమె సినిమాకు ఓకే చెప్పింది. ముందు సినిమాలు చేయనని చెప్పి ఆ తర్వాత ఇంట్లో వారితో ఒక్కమాటైనా చెప్పకుండా సినిమాకు ఓకే చేయడం విజయ్‌కు నచ్చలేదు. దాంతో వారి దాంతప్య జీవితాల్లో విభేదాలు వచ్చాయి. అందుకే విడిపోయారు’ అని వెల్లడించారు. READ ALSO: ఈ విషయం ఇప్పటివరకు ఎవ్వరికీ తెలీదు. దాంతో అళగప్పన్ వ్యాఖ్యలపై కోలీవుడ్ షాక్‌కు గురైంది. మరి దీనిపై అమల, విజయ్, ధనుష్ ఏమంటారో వేచి చూడాలి. మరోపక్క విజయ్ ఇటీవల మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అమల కూడా మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నారని ఓసారి వెల్లడించారు. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Uka2j9
No comments:
Post a Comment