Saturday, 1 February 2020

Disha: రేపిస్ట్ చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ

వివాదాల దర్శకుడు ఎట్టకేలకు సమాజానికి అవసరమైన టాపిక్‌ను ఎంచుకుని సినిమాను తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగానూ సంచలనం రేపిన దిశ ఘటనపై సినిమాను తెరకెక్కిస్తున్నట్లు నిన్న వెల్లడించారు. కొన్ని నెలల క్రితం తెలంగాణకు చెందిన వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు వ్యక్తులు మాయమాటలు చెప్పి రేప్ చేసి సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణ పోలీసులు నిందితలను ఎన్‌కౌంటర్ చేయడంతో కథ సుఖాంతమైంది. ఇప్పుడు ఇదే టాపిక్‌తో వర్మ ‘దిశ’ అనే సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపిస్ట్‌లలో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక వర్మ ఈరోజు కలిశారు. ఆమెను తన ఆఫీస్‌కు పిలిపించి కీలక విషయాలు అడిగి తెలుసుకున్నారట. ‘‘రేపిస్ట్ చెన్నకేశవులు భార్య రేణుకను కలవడం జరిగింది. పదహారేళ్ల వయసులోనే రేణుక చెన్నకేశవులును పెళ్లి చేసుకుంది. 17 ఏళ్లకే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. దిశనే కాదు ఆ రాక్షసుడు రేణుకను కూడా మోసం చేశాడు. రేణుక ఇంకా చిన్న పిల్ల. అలాంటిది ఆమె త్వరలో ఓ పిల్లకు జన్మనివ్వబోతోంది. వీరిద్దరికీ భవిష్యత్తు లేదు’’ అని మండిపడ్డారు. READ ALSO: దిశ సినిమా గురించి వర్మ ట్వీట్ చేస్తూ.. ‘‘నా తర్వాతి సినిమా పేరు ‘దిశ’. దిశ రేప్ ఘటన గురించి ఈ సినిమా ఉండబోతోంది. ‘నిర్భయ’ హత్యాచారం తర్వాత అంతకంటే దారుణంగా ఓ ఆడపిల్లలను రేప్ చేసి సజీవదహనం చేశారు. ఒకప్పటి రేపిస్ట్‌ల నుంచి కొత్తగా వస్తున్న రేపిస్ట్‌లు ఏం నేర్చుకుంటున్నారో ‘దిశ’ సినిమాలో భయంకరమైన గుణపాఠంగా చెప్పబోతున్నాను. నిర్భయను రేప్ చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయారు. అలా చేస్తే శిక్ష పడదు అనుకున్నారు. కానీ పోలీసులు పట్టుకున్నారు. అలాంటి పరిస్థితి తమకు ఎదురుకాకూడదని దిశను రేపిస్ట్‌లు కాల్చి చంపేశారు’’ అని వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2uVev1c

No comments:

Post a Comment

'Women In Paatal Lok Rarely Cry'

'No woman is stronger than one who acknowledges her vulnerabilities.' from rediff Top Interviews https://ift.tt/nduI8wb