Saturday 22 February 2020

అతనికి నా నెంబర్ ఎందుకిస్తాను, కాస్త బుర్రవాడండి: యాంకర్ రష్మి మండిపాటు

చావు అంచుల దాకా వెళ్లొచ్చి ప్రాణాలతో బయటపడిన కుక్కపిల్లలను ఎవరైనా దత్తత తీసుకుంటారని ఆశించి.. ఇటీవల ప్రముఖ యాంకర్ ఓ ట్వీట్ పెట్టారు. ఖైరతాబాద్‌కు చెందిన ధ్రువ్ ఆదిత్య అనే సోషల్ వర్కర్ గాయపడిన రెండు కుక్క పిల్లలను కాపాడాడని, వాటిని ఎవరైనా దత్తత తీసుకోవాలని అనుకుంటే ఈ నెంబర్‌కు సంప్రదించండి అని కుక్క పిల్లల ఫొటోలతో పాటు ఫోన్ నెంబర్‌ను కూడా రష్మి ట్వీట్ చేసారు. అయితే ఇప్పటివరకు ధ్రువ్‌కి ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయట. వారిలో ఒక్కరు కూడా కుక్కల గురించి ఆరాతీయడం కానీ, వాటికి ఏమైనా సాయం చేయగలమా అని అడగలేదట. అందరూ రష్మితో మాట్లాడాలి, ఒకసారి ఆమెకు ఫోన్ ఇస్తారా అని అడిగారట. దాంతో ధ్రువ్ విసిగిపోయారు. ఈ విషయాన్ని రష్మికి ఫోన్ చేసి చెప్పారు. దాంతో రష్మి నెటిజన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసారు. Also Read: ‘‘అందరికీ ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఇటీవల రెండు కుక్క పిల్లలను ఎవరైనా దత్తత తీసుకుంటారేమోనని ఫోన్ నెంబర్ ట్వీట్ చేసాను. చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి కానీ వారంతా నాతో మాట్లాడటానికి ఫోన్ చేసినవారే. అందులో తప్పు లేదు. సెలబ్రిటీలతో మాట్లాడాలని అందరికీ ఉంటుంది. కానీ కాస్త బుద్ధివాడండి. నేను అతనికి నా ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తాను? నా సంగతి పక్కనబెట్టండి.. మీరైనా పబ్లిక్‌గా మీ నెంబర్‌ను అందరికీ ఇచ్చేయరు కదా. కాస్త కామన్ సెన్స్ వాడండి. ధ్రువ్ ఓ సోషల్ వర్కర్. ఎవరో పిల్లలు రోడ్డుపై ఉన్న కుక్క పిల్లలను గాయపరిస్తే ధ్రువ్ వాటిని కాపాడి తన వద్ద ఉంచుకున్నాడు. వాటిని ఎవరైనా దత్తత తీసుకుంటారేమోనని చూస్తున్నారు. అందుకే అతని నెంబర్ ట్వీట్ చేసాను. కానీ మీరు అతనికి ఫోన్ చేసి నాతో మాట్లాడాలని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ చెప్పండి. మీరు సాయం చేయకపోయినా ఫర్వాలేదు. కానీ రిటర్న్‌గా ఏమీ ఆశించకుండా మూగజీవులకు సాయం చేస్తున్న ఇలాంటివారిని మాత్రం కష్టపెట్టకండి. అది చాలా పాపం’’ అని మండిపడ్డారు రష్మి. See Photo Story:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VdGnc7

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz