Saturday 22 February 2020

ఆ పెద్ద మనిషి ఉంగరం తెచ్చి నువ్వే నా ప్రాణం అన్నాడు: మాధవీలత షాకింగ్ పోస్ట్

నటి .. సినీ, రాజకీయ వర్గాల్లో ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్‌గా మారింది. ‘నచ్చవులే’ చిత్రంతో నటిగా గుర్తింపు సంపాదించుకుని ఆ తరువాత కాలంలో సరైన అవకాశాలు లేక పొలిటికల్ టర్న్ తీసుకున్నారు మాధవీలత. గత ఎన్నికల్లో గుంటూరు బీజేపీ పశ్చిమ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. అనంతరం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటూనే ఫేస్ బుక్‌ ద్వారా ఆసక్తికరమైన పోస్ట్‌లను షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ గురించి తెలియజేస్తూ.. ప్రేమ పేరుతో మోసపోకండి అని లెక్చర్స్ ఇస్తోంది మాధవీలత. ఈ సందర్భంగా తనకు ఎదురైన ప్రేమ అనుభూతిని ఫేస్ బుక్‌ పోస్ట్ ద్వారా పంచుకుంది. ‘మీకు చెప్పడం మర్చిపోయాను పోయిన సంవత్సరం ఒక పెద్ద మనిషి ఉంగరం పట్టుకు వచ్చి నువ్వు నా ప్రేమ నా ప్రాణం నువ్ లేవు అనే మాట ఊహించుకోలేను అన్నాడు. ఎన్నాళ్ళు ప్రేమిస్తావ్ అని అడిగా.. నా ప్రాణాలతో ఉన్నంతవరకు ప్రేమిస్తా నువ్ నా దేవత.. నువ్ లేకుంటే బతకలేనని అన్నాడు. ఆ తర్వాత మాయం అయ్యాడు. ప్రేమ ఏమైందో ప్రాణం ఏమైందో తెలియదు. హో.. పాపం పోయాడేమో.. పోయేవరకు ప్రేమిస్తా అన్నాడుగా మీకు ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి బాబులు. ఇలా ప్రతి ఒకడు ఈ మధ్య పెళ్లి అయిన అబ్బాయిలు, పెళ్లి కానీ అబ్బాయిలు అమ్మాయిలకి ప్రేమ అని వలలు వేయడం.. ఒప్పుకుంటే నాశనం చేయడం ఒక పనిలా మారింది. ఒకవేళ ఒప్పుకోకపోతే లైఫ్ సేఫ్. వాడి ఫేక్ ప్రేమకు ఒప్పుకుంటే సర్వం నాశనం. ప్రేమ దోమా తొక్క ఇలాంటివి ఏం లేవు కానీ.. జీవితం చాలా పెద్దది. అప్పట్లో తొలి ప్రేమ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ప్రేమ పేరుతో అబ్బాయిలు పిచాచాల్లా తిరుగుతూ ఉంటారు అని. ఇదిగో అబ్బాయిలు నిజంగా ప్రేమించే దమ్ము లేనపుడు ఎందుకు నాటకాలు ?? పాపం అమ్మాయిలని బతకనివ్వండి. సమాజంలో ఎలాగూ హింస. వాళ్ళకి ప్రేమ పేరుతో ఇంకా హింస. కాస్త తెలివిగా లేకపోతే ఏమైపోతుంది వాళ్ల బతుకు. కొంతమంది అమ్మాయిలు ఇలానే తయారయ్యారు అవసరానికి ప్రేమలు అని. తూ.. దీనెమ్మ జీవితం అలాంటి అమ్మాయిలని అబ్బాయిలు నిజంగా ప్రేమిస్తారు. నిజంగా ప్రేమించే అమ్మాయిలని మోసం చేస్తారు. సరిపోయింది. ఎందుకు ఇలాంటి బతుకులు నీతి నిజాయితీ లేనపుడు ఎలపరం వచ్చేస్తుంది’ అంటూ ప్రేమ పాఠాలు చెప్పుకొస్తున్నారు మధవీలత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ulI7ox

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz