మరో రెండు వారాల్లో వ్యాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ప్రేమికులంతా ఆరోజున లవర్స్‌కు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలా అని ఇప్పటినుంచే తెగ ఆలోచించేస్తుంటారు. సుప్రీం హీరో కూడా రెడీ అయిపోయారు. ఆయన కూడా గిఫ్ట్‌తో రెడీగా ఉన్నారట. ప్రేయసి కోసం కాదు. సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నవారి కోసం. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేష్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను వ్యాలెంటైన్స్ రోజున రిలీజ్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ధరమ్ ఆసక్తికరంగా ప్రకటించారు. ‘సోలో సోదర సోదరీమణులారా.. ఈ వ్యాలెంటైన్స్ వీకెండ్ మనం అంతా కలిసి జరుపుకుందాం. స్లోగన్ ఒక్కటే.. సోలో బ్రతుకే సో బెటర్’ అని కామెంట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. టైటిల్‌తోనే సినిమాకు యూత్ కనెక్ట్ అయిపోయారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. READ ALSO: ఒకప్పుడు వరుస ఫ్లాప్స్‌తో సతమతమయిన సాయి తేజ్‌కు ‘చిత్రలహరి’ కాస్త ఊరటనిచ్చింది. ఆ తర్వాత ‘ప్రతిరోజూ పండగే’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పడగానే ధరమ్ తేజ్ కూడా గాడిలో పడ్డారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా కూడా హిట్ అయిపోతే సాయి తేజ్ వరుసగా హ్యాట్రిక్ కొట్టినట్లు అవుతుంది. మునుపెన్నడు లేని విధంగా సాయి ఈ సినిమాలో సరికొత్తగా ఎట్రాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. See Photo Story:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2GNh1Jq
No comments:
Post a Comment