Saturday, 1 February 2020

Budget 2020: సినిమా రంగాన్ని గాలికొదిలేసిన మోదీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం లోక్‌సభలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎక్కువగా వ్యవవాయ రంగం, విద్య సెక్టార్స్‌పై ఫోకస్ చేశారు. అయితే వినోదాత్మక రంగం గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. 2019 మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ భారతీయ చిత్ర పరిశ్రమ గురించి ప్రస్తావించారు. వినోదాత్మక రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. పైరసీని అంతమొందించేందుకు సినిమాటోగ్రఫీ యాక్ట్‌ కింద సింగిల్‌ విండో క్లియరెన్స్, యాంటీ క్యామ్‌కార్డింగ్‌ ప్రొవిజన్‌ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. సినిమా టికెట్లపై జీఎస్టీని తగ్గించారు. రూ.100 టికెట్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. రూ.100 మించిన టికెట్ల ధరపై 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించారు. గతేడాది చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలపై బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులతో ప్రధాన నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. వారికి ఏం కావాలో తెలుసుకుని 2019 మధ్యంతర బడ్జెట్‌లో వినోదాత్మక రంగానికి కేటాయింపులు ఇచ్చారు. అయితే 2019-2020 బడ్జెట్‌లో మాత్రం అసలు సినిమా రంగం ఊసే లేదు. READ ALSO: ప్రవేశపెట్టానికి కొన్ని రోజుల ముందు ముక్తా ఆర్ట్స్ ఎండీ రాహుల్ పూరి వినోదాత్మక రంగానికి కావాల్సిన అంశాల గురించి మీడియాతో మాట్లాడారు. యూనిఫాం టాక్సేషన్ వల్ల ఎంటర్‌టైన్మెంట్ రంగానికి కలిసొస్తుందని అభిప్రాయపడ్డారు. అంటే టికెట్ ధరలపై ఉండే జీఎస్టీ రేట్లు, డిస్ట్రిబ్యూటర్ల రేట్లు ఒకేలా ఉండటం. ప్రస్తుతం టికెట్ ధర వంద రూపాయల కన్నా తక్కువగా ఉంటే 12 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. వంద రూపాయల కన్నా ఎక్కువ ఉంటే 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. మరోపక్క డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాలు విడుదల చేసుకోవాలంటే పన్నెండు శాతం జీఎస్టీ కట్టాల్సిందే. చిన్న పట్టణాల్లో, నగరాల్లో కొత్తగా వస్తున్న థియేటర్లపై పన్నులు విధించకపోవడమే మంచిది అవుతుందని తెలిపారు. వినోదాత్మక రంగంలో మ్యూజిక్, స్పోర్ట్స్‌కు సంబంధించిన ఈవెంట్స్‌పై అత్యధికంగా 28 శాతం జీఎస్టీని విధించారు. దీనిని 18 శాతానికి కుదిస్తే బాగుంటుందని అన్నారు. కానీ 2020 బడ్జెట్‌లో మోదీ ఎంటర్‌టైన్మెంట్ సెక్టార్ గురించి అసలు ఆలోచించినట్లు లేరని క్లియర్‌గా అర్థమవుతోంది. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2GJJAHU

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ