టాలీవుడ్‌లో హాట్ యాంకర్లలో ఒకరు. ఆమె వేసుకునే దుస్తులు, ఆభరణాలు చాలా ట్రెండీగా ఉంటాయి. ప్రతీ షో ముందు అనసూయ చక్కగా తయారై ఫొటోలకు పోజులిస్తూ ఉంటారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే మిగతా విషయాలు ఎలా ఉన్నా స్టైల్ విషయంలో మాత్రం ఇతర మహిళలు తనని చూసి నేర్చుకుంటున్నారట. ఎవరో అనడం కాదు అనసూయే అంటోంది. పైగా తనతో ఇతరులకు పోటీ ఏంటి అంటోంది. అయితే అను సీరియస్‌గా అన్న మాటలు కావు లెండి. తన ఫొటోషూట్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రతీసారి అను ఓ క్యాప్షన్ పెడుతూ ఉంటుంది. ఈసారి కూడా అలాంటి క్యాప్షనే పెట్టింది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో వెరైటీగా చీర కట్టుకుని ‘లోకల్ గ్యాంగ్స్’ అనే ప్రోగ్రామ్ కోసం ముస్తాబైంది. ఆ తర్వాత ఫొటోలు దిగింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘నేను ఎలాంటి మహిళనంటే.. నన్ను చూసి ఇతర మహిళలు స్టైల్‌గా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నారు. అలాంటప్పుడు నాకు పోటీనా? అసలు పోటీ అంటే ఏంటి?’’ అని కామెంట్ పెట్టింది. మొత్తానికి అనసూయ వరుస షోలు సినిమాలతో బాగా బిజీ అయిపోయింది. ఇప్పటికే ‘జబర్దస్త్’, ‘లోకల్ గ్యాంగ్స్’లాంటి షోలతో పాటు ఇటీవల ‘ప్రతి రోజూ పండగే’ అనే ఆడవాళ్ల షోను మొదలుపెట్టేసింది. మరోపక్క వరుసగా సినిమాలు కూడా చేసేస్తోంది. ఈసారి ఏకంగా బంపర్ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. READ ALSO: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అను.. బన్నీకి విలన్ పాత్రలో నటించనుందట. గతంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం సినిమాలోనూ నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించింది అనసూయ. గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌లోనూ సత్తా చాటిన రంగమ్మత్త బన్నీ సినిమాలో ఏ స్థాయిలో విలనిజం పడిస్తుందో చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36NqUlh
No comments:
Post a Comment