Wednesday, 22 January 2020

అల్లు అర్జున్ ఇంట విషాదం.. మేనమామ హఠాన్మరణం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంట విషాదం నెలకొంది. బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ హఠాన్మరణం చెందారు. గుండెపోటు రావడంతో బుధవారం ఉదయం ఆయన విజయవాడలో కన్నుమూశారు. సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో నిర్మితమవుతోన్న సినిమాకి ఈయన సహ నిర్మాత. ప్రసాద్ మరణంతో అల్లు ఫ్యామిలీలో విషాదం అలుముకుంది. ‘అల వైకుంఠపురములో’ విజయంతో ఎంతో సంతోషంగా ఉన్న అల్లువారింట ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం బాధాకరం. అల్లు అర్జున్ తల్లి నిర్మలాదేవికి ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ స్వయానా అన్నయ్య. బన్నీకి పెద్ద మావయ్య. మేనమామతో బన్నీకి ఎంతో అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచి ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. పండగలకు మావయ్య ఇంటికి బన్నీ వెళ్తుండేవారు. తమ కుటుంబానికి ఎంతో దగ్గరగా ఉండే ప్రసాద్ చనిపోయారనే వార్త తెలియడంతో అల్లు ఫ్యామిలీ షాక్ గురైంది. ఈ విషాద వార్త తెలుసుకున్న వెంటనే అల్లు కుటుంబం మొత్తం విజయవాడకు వెళ్లింది. Also Read: మరోవైపు, అల్లు అర్జున్ తన 20వ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ద్వారా బన్నీ మేనమామ ప్రసాద్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో ఆయన కూడా భాగస్వామి అయ్యారు. చిత్ర ప్రారంభోత్సవంలోనూ ఆయన పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకాకుండానే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ప్రసాద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TOZIzr

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....