దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తు్న్న సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తు్న్నారు. సెన్సేషనల్ డైరెక్టర్, పెద్ద స్టార్స్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా. దాంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే సినిమాకు సంబంధించిన ఎలాంటి పోస్టర్, టైటిల్ రివీలేషన్ లేకపోయినప్పటికీ ఫ్యాన్స్ అప్‌సెట్ అవ్వకుండా ఓపిగ్గా వేచి చూస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ సూపర్‌స్టార్ సెట్‌లో అడుగుపెట్టారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది. సినిమాలో తారక్, చెర్రీల పాత్రల వివరాలు బయటపెట్టిన జక్కన్న, అజయ్ దేవగణ్ పాత్ర గురించి ఏ విషయం వెల్లడించలేదు. దాంతో ఆయన ఏ పాత్రలో నటించబోతున్నారు అన్న ఆత్రుత ప్రేక్షకుల్లో మరింత పెరిగిపోయింది. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో అజయ్ పాత్ర ఇదీ అంటూ సోషల్ మీడియాలో ఓ టాపిక్ వైరల్ అవుతోంది. ఇందులో అజయ్ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పాత్రలో నటిస్తున్నారట. ఈయన క్యారెక్టరైజేషన్ వల్లే తారక్, చెర్రీల పాత్రలు ఎలివేట్ అవుతాయట. భగత్ సింగ్ చెప్పడం వల్లే అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు బ్రిటీషు వారిపై తిరుగుబాటు యత్నం చేస్తారట. READ ALSO: ఈ విషయంలో ఎంత నిజం ఉన్నది ‘ఆర్ ఆర్ ఆర్’ టీం నుంచే తెలియాలి. ఇందులో చెర్రీకి జోడీగా ఆలియా భట్, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య దాదాపు రూ.300 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమాను జులై 30న రిలీజ్ చేస్తామని 2019లోనే రాజమౌళి ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. కానీ అది జరిగేలా లేదు. సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేసినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అయ్యేలా ఉన్నాయని తెలుస్తోంది. అందుకే సినిమాను జులై 30న కుదరకపోతే అక్టోబర్‌లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NRqy6u
No comments:
Post a Comment