Tuesday, 21 January 2020

అమలా పాల్ ఇంట విషాదం.. పుట్టెడు దుఖంలో నటి

ప్రముఖ తమిళ నటి తండ్రి పాల్ వర్గీస్ (61) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పాల్ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అమల నటించిన ‘అదోఅంద పారావాయ్ పోలా’ ట్రైలర్ లాంచ్ నిమిత్తం అమల రెండు రోజుల పాటు చెన్నైలో ఉన్నారు. తన తండ్రి మరణ వార్త వినగానే హుటాహుటిన స్వస్థలమైన కేరళకు వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం కురుప్పంపాడి ప్రాంతంలోని సెంట్ పీటర్ అండ్ సెంట్ పాల్ చర్చిలో మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పాల్ వర్గీస్‌కి భార్య ఆన్నిస్ పాల్, పిల్లలు అమల, అభిజీత్ ఉన్నారు. అమల సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు తండ్రి పాల్ వర్గీస్ అస్సలు ఒప్పుకోలేదు. అప్పుడు అమల సోదరుడు అభిజీత్ నుంచి సపోర్ట్ రావడంతో చివరకు ఆయన ఒప్పుకున్నారట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2sLq2PY

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....