ఎంత స్టార్ హీరోలైనా వారికంటూ ఫేవరేట్ హీరోలు ఉంటారు. వారిలా అవ్వాలనే సినిమాల్లోకి రావాలనుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు ఒకరు. శ్రీవిష్ణు విక్టరీ వెంకటేష్‌కు వీరాభిమాని. ఈ విషయం ఆయన ఎన్నో సార్లు మీడియా ముందు తెలిపారు. ఒకప్పుడు వెంకటేష్‌ని ఒక్కసారి చూస్తే చాలనుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు ఏకంగా ఆయన పక్కన ఓ హీరోలా కూర్చునే స్థాయికి ఎదిగాడు. ఇటీవల ‘మిస్ మ్యాచ్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వెంకటేష్, శ్రీవిష్ణు ముఖ్య అతిథులుగా వెళ్లారు. ఆ సమయంలో శ్రీ విష్ణు వెంకీ పక్కనే కూర్చున్నారు. ఆ సమయంలో దిగిన ఫొటోను శ్రీవిష్ణు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ‘2004లో ఘర్షణ ఆడియో ఫంక్షన్ జరుగుతుంటే వెళ్లాను. ఆ సమయంలో వెంకటేష్‌గారిని ఒక్కసారైనా దగ్గర్నుంచి చూడకపోతానా అని ఎంతో పరితపించాను. ఏదో ఒక్క రోజు ఆయన పక్కన కూర్చోవాలని నిర్ణయించుకున్నాను. ఆయన పక్కన కూర్చునే అర్హతను నాకు కల్పించిన డైరెక్టర్లకు ధన్యవాదాలు. నా కల నెరవేరింది’ అని పేర్కొ్న్నారు. ‘సోలో’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు శ్రీవిష్ణు. ఆ తర్వాత ‘ఒక్కడినే’, ‘ప్రతినిధి’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘వీరభోగ వసంతరాయలు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీవిష్ణు నటించిన ‘నీది నాది ఒకే కథ’ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ‘బ్రోచేవారెవరురా’ సినిమా కూడా శ్రీవిష్ణుకు హిట్ ఇచ్చింది. ఆయన నటించిన ‘తిప్పర మీసం’ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2rNlqrS
No comments:
Post a Comment