యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇండస్ట్రీలో గొప్ప పేరున్న రెండు బడా ఫ్యామిలీలకు చెందిన ఈ ఇద్దరి హీరోల మధ్య స్నేహం అభిమానుల మధ్య కూడా ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు కలిసి ‘RRR’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించనున్నారనే వార్త గత కొద్ది రోజులుగా బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లోని చాలా మంది హీరోలకు సొంతంగా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. మహేష్ బాబు, రామ్ చరణ్, నాగార్జున, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ ఒకవైపు హీరోలుగా సినిమాలు చేస్తూనే మరోవైపు సినిమాలు నిర్మిస్తున్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్ ద్వారా మహేష్ బాబు బాగానే ఆర్జిస్తున్నారు. అలాగే, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి తండ్రి చిరంజీవితో సినిమాలు చేస్తున్నారు చరణ్. Also Read: అయితే, తనకు బాగా క్లోజ్ అయిన హీరోలకు రామ్ చరణ్ వ్యాపారపరమైన సలహాలు ఇస్తున్నారట. ఈ క్రమంలో ఎన్టీఆర్‌కు కూడా చరణ్ ఒక సలహా ఇచ్చారట. తనలానే ఒక ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించమని చెప్పారట. ఎన్టీఆర్ కూడా దీని గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఫైనల్‌గా ‘భార్గవ్ హరి ప్రొడక్షన్స్’ పేరిట బ్యానర్‌ను స్థాపించాలని తారక్ డిసైడ్ అయ్యారట. తన కుమారుడు, తండ్రి పేర్లు కలిసేలా ఎన్టీఆర్ తన బ్యానర్ పేరును అనుకున్నారని ఇండస్ట్రీ టాక్. RRR తరవాత తన ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించి ఎన్టీఆర్ బిగ్ అనౌన్స్‌మెంట్ చేయనున్నారని అంటున్నారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34M00Ji
No comments:
Post a Comment