Monday, 16 December 2019

Chiranjeevi: షూటింగ్ మొదలే కాలేదు.. అప్పుడే రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

రీ ఎంట్రీ తరువాత మెగాస్టా్ర్‌ స్టో అండ్‌ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. ఖైదీ నంబర్‌ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్‌ . తరువాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చారిత్రక చిత్రం సినిమాతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ఘన విజయం సాధించకపోయినా మంచి వసూళ్లనే రాబట్టింది. సైరా రిలీజ్‌ తరువాత గ్యాప్‌ తీసుకున్న మెగాస్టార్‌ త్వరలో తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా చెన్నై బ్యూటీ త్రిష నటించనుంది. Also Read: అయితే ఇంకా షూటింగ్ ప్రారంభం కాకపోయినా.. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌పై చర్చ మొదలైంది. సందేశాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. భరత్‌ అనే నేను సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న దర్శకుడు , మెగా ఇమేజ్‌కు తగ్గ కథను రెడీ చేశాడు. ఈ సినిమాలో చిరు యంగ్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే కొత్త లుక్‌ కోసం కసరత్తులు ప్రారంభించిన మెగాస్టార్‌ జిమ్‌లో కష్టపడుతున్నాడు. అదే సమయంలో యంగ్‌ కనిపించేందుకు ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నాడు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2sCwR5P

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....