Wednesday, 18 December 2019

Chiranjeevi: వెంకీమామపై మెగాస్టార్ ప్రశంసలు.. 50 కోట్లు దాటిన కలెక్షన్లు

విక్టరీ , యువ సామ్రాట్ నాగచైతన్యలు హీరోలుగా తెరకెక్కిన తాజా చిత్రం వెంకీ మామ. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి ఈ సినిమాకు మంచి రెస్సాన్స్‌ వస్తోంది. ఆడియన్స్‌తో పాటు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా సూపర్‌ అంటూ కితాబిచ్చారు. తాజాగా ఈ లిస్ట్‌లో మెగాస్టార్‌ కూడా చేరిపోయాడు. టాలీవుడ్‌ మెగాస్టార్ కుటుంబ సమేతంగా వెంకీ మామ సినిమాను చూశాడు. హీరో వెంకటేష్‌ కలిసి రామానాయుడు స్టూడియోలో వెంకీ మామ సినిమాను చూశాడు. అంతేకాదు సినిమా మీద తన అభిప్రాయాలను వీడియో మెసేజ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా ఆ వీడియోను రిలీజ్ చేశాడు వెంకీ మామ టీం. Also Read: వీడియో చిరు మాట్లాడుతూ హీరోలు వెంకటేష్‌, నాగ చైతన్యలతో పాటు దర్శకుడు బాబీని ప్రత్యేకంగా అభినందించాడు. ముఖ్యంగా వెంకటేష్‌ కామెడీ, ఎమోషన్స్‌, సెంటిమెంట్‌ సీన్స్‌లో అద్భుతంగా నటించాడని ప్రశంసల జల్లు కురిపించాడు. నాగ చైతన్య కూడా మామకు తగ్గ అల్లుడిగా ప్రూవ్ చేసుకున్నాడన్నారు. చైతూ మెచ్యూర్డ్‌ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడన్నారు. Also Read: సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో వెంకటేష్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, నాగ చైతన్య సరసన రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా 50 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2r8tzan

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....