డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిన్న సినిమాలు ఇటీవల మంచి విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త తరహా కథా కథనాలతో వస్తున్న సినిమాలు ఘన విజయం సాధిస్తున్నాయి. ఆ నమ్మకంతోనే మరో యంగ్ టాలెంటెడ్ టీమ్ `మత్తు వదలరా` అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో ప్రముఖ సంగీత దిగ్గజం ఎమ్.ఎమ్.కీరవాణి చిన్న కుమారుడు హీరోగా పరిచయం అవుతుండగా, కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. రితేష్ దర్శకుడిగా అరంగ్రేటం చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూమీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. Also Read: చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలుగా రూపొందిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇటీవల యంగ్‌టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయగా, తాజాగా ఈ చిత్ర టీజర్‌ను నేడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఫేస్బుక్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. `యంగ్ టాలెంట్‌ను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో నిర్మించిన చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలతో చిత్రం వుంటుంది. ఎంటర్టైనింగ్గా సాగే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రం ద్వారా ఎంతో మంది నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం` అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2rewLRW
No comments:
Post a Comment