Wednesday, 25 December 2019

క్రిస్మస్‌ సందర్భంగా వెరైటీగా విష్‌ చేసిన హాట్ హీరోయిన్‌

హార్ట్‌ ఎటాక్‌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన అందాల భామ . తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తరువాత హీరోయిన్‌గా వరుస అవకాశాలు సాధించలేకపోయింది. దీంతో బాలీవుడ్‌ మీద దృష్టి పెట్టిన ఈ భామ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది. అయితే సినిమాల విషయం పక్కన పెడితే సోషల్‌ మీడియాలో మాత్రం ఈ భామ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన హాట్‌ హాట్‌ ఫోటో షూట్‌లతో పాటు తనకు ఎదురైన అనుభవాలను కూడా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా క్రిస్మస్‌ సందర్భంగా అభిమానులకు వెరైటీగా విషెస్‌ చెప్పింది ఈ హాట్‌ బ్యూటీ. స్వతహాగా క్లాసికల్‌ డ్యాన్సర్‌ అయిన అదా క్రిస్మస్‌ క్యారల్‌ జింగిల్‌ బెల్స్‌ పాటకు కథక్‌ డ్యాన్స్‌ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. Also Read: ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల సూపర్ హిట్ యాక్షన్‌ సిరీస్‌ కమాండో సిరీస్‌లో భాగంగా వచ్చిన కమాండో 3తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అదా. ఈ సినిమాలో విద్యుత్‌ జమ్వాల్‌కు జోడిగా నటించిన ఈ బ్యూటీ యాక్షన్‌ సీన్స్‌లోనూ ఇరగదీసింది. ప్రస్తుతం మ్యాన్‌ టు మ్యాన్‌ అనే సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటి. Also Read: తెలుగులో హార్ట్‌ ఎటాక్‌ తరువాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ లాంటి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలు సక్సెస్‌ అయినా అదా కెరీర్‌కు మాత్రం ఉపయోగపడలేదు. తరువాత అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన క్షణం సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్నా ఈ హాట్ బ్యూటికి టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం రాలేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2skBEt2

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...