యంగ్ రెబల్ స్టార్‌గా టాలీవుడ్‌కి పరిచయమై పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటుడు . బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రభాస్ సినిమాల విషయంలో చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. బాహుబలి సమయంలో దాదాపు ఐదేళ్ల పాటు ఆ ఒక్క సినిమాకే పరిమితమై పోయాడు ప్రభాస్. తరువాత మరో భారీ చిత్రం సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్నాడు. దీంతో తమ ఫేవరెట్ స్టార్ సినిమా చేసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలం ఎదురుచూడాల్సి వస్తుంది. తరువాతైన యంగ్ రెబల్ స్టార్ వేగంగా సినిమాలు చేస్తాడని అంతా భావించారు. కానీ ఆ పరిస్థితి కనిపించటం లేదు. Also Read: సాహో సినిమా సెట్స్ మీద ఉండగానే జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాను ప్రారంభించాడు ప్రభాస్. ఈ సినిమాకు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను ప్రారంభించాల్సి ఉంది. అయితే సాహో తరువాత ప్రభాస్ లాంగ్ బ్రేక్ తీసుకోవటంతో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాలేదు. జనవరి నెలాఖరున షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. జాన్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కావటంతో షూటింగ్‌కు చాలా సమయం పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. అంటే ప్రభాస్ నుంచి మరో సినిమా రావటంలో దాదాపు మరో ఏడాది సమయం పడుతుందని భావిస్తున్నారు. కనీసం సినిమాను దసరా వరకైనా రెడీ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. Also Read: ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌పై యూవీ క్రియేషన్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ వింటేజ్ సెట్స్‌ను రెడీ చేస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34BcQu1
No comments:
Post a Comment