తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన తమిళ సినిమాలన్నీ తెలుగులో అనువాదమై విడుదలవుతున్నాయి. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తోన్న కార్తి.. తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా తనేంటో నిరూపించుకున్న హీరో కార్తి. ఇటీవల ‘ఖైదీ’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తి ఇప్పుడు ‘దొంగ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో ‘తంబి’గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ‘దొంగ’గా అందిస్తున్నారు. ‘దృశ్యం’ సినిమాతో బాగా పాపులర్ అయిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జ్యోతిక, సత్యరాజ్, నిఖిల, ఆన్సన్, షావుకారు జానకి, సీత ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను తమిళంలో వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ సంస్థలు నిర్మించాయి. తెలుగులో ఈ సినిమాను హర్షిత మూవీస్ పతాకంపై నిర్మాత రావూరి వి. శ్రీనివాస్ అందిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Also Read: ఇప్పటికే సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే, వీళ్లలో ఎక్కువ మంది తమిళ ప్రేక్షకులే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే సినిమాపై మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. కొంత మంది సినిమా చాలా బాగుంది అంటే.. కొంత మంది మాత్రం అస్సలు బాగాలేదని అంటున్నారు. ‘దొంగ’ ఒక మంచి థ్రిల్లర్ మూవీ అని.. కార్తి, సత్యరాజ్ అద్భుత నటనతో ఆకట్టుకున్నారని కొంత మంది అంటున్నారు. ‘ఖైదీ’ తరవాత మరో హిట్ అందుకున్నారని కొనియాడుతున్నారు. Also Read: మరోవైపు, ‘దొంగ’ చెత్త సినిమా అని కొంత మంది ట్వీట్లు చేస్తున్నారు. ‘దేవ్’ తరవాత కార్తి కెరీర్‌లో మరో చెత్త సినిమా ఇదని చెబుతున్నారు. ‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత చేయాల్సిన సినిమా కాదని సలహాలు ఇస్తున్నారు. ఈ మిక్స్‌డ్ టాక్ మధ్య యావరేజ్ టాక్ కూడా ‘దొంగ’కు వినిపిస్తోంది. ఫస్టాఫ్ బోరింగ్‌గా ఉన్న సెకండాఫ్ మాత్రం అదిరిపోయిందని కొంత మంది చెబుతున్నారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు అదిరిపోతాయట. ఇదిలా ఉంటే, జ్యోతిక కనిపించే సన్నివేశాలు చాలా తక్కువ అని కొంత మంది పెదవి విరుస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతానికి అయితే ‘దొంగ’ టాక్‌పై ఒక స్పష్టత లేదు. మరి కొన్ని గంటలు ఆగితే కానీ సినిమా ఎలా ఉందో చెప్పలేం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PEXgZZ
No comments:
Post a Comment