Sunday, 22 December 2019

ఏపీకి మూడు రాజధానులు: చిరంజీవి పేరిట ప్రకటన.. అది ఫేక్ అన్న మెగాస్టార్

‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు’’ అని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలుకుతూ మెగాస్టార్ చిరంజీవి శనివారం ఒక ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనని చిరంజీవి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. అమరావతిని శాసన నిర్వాహక, విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక, కర్నూల్‌ను న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలన్నారు. ఈ మేరకు తన పేరిట ఉన్న లెటర్ హెడ్‌‌తో ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటును సమర్థిస్తూ గానీ, వ్యతిరేకిస్తూ గానీ తాను ఏ విధమైన ప్రకటన చెయ్యలేదంటూ చిరంజీవి పేర్కొన్నట్టు ఆదివారం మరో లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది కూడా చిరంజీవి పేరిట ఉన్న లెటర్ హెడ్‌తోనే విడుదలైంది. అయితే, ఈ లేఖ ఫేక్ అని చిరంజీవి స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియాకు ఒక వాయిస్ మెసేజ్‌ను పంపారు. శనివారం తాను లెటర్ హెడ్ మీద ఇచ్చిన ప్రకటన వాస్తవమని.. ఆదివారం తన పేరిట సర్క్యులేషన్‌లోకి వచ్చిన ప్రకటన అవాస్తవమని స్పష్టం చేశారు. Also Read: ‘యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది... ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుని సమర్థిస్తూ గానీ, వ్యతిరేకిస్తూ గానీ నేను ఏ విధమైన ప్రకటన చెయ్యలేదు. తెలుగు ప్రజలకు చేరువచేసి, నన్నింతవాణ్ణి చేసిన సినిమా రంగం మీదే నా దృష్టి ఉంది. దయచేసి అందరూ గమనించగలరు’ అని చిరంజీవి పేరిట, ఆయన సంతకంతో సహా ఒక లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఇది ఫేక్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2tGiazj

No comments:

Post a Comment

'Modiji Has Tamed The People Of India'

'The BJP has killed public anger. They have killed people's self-respect.' from rediff Top Interviews https://ift.tt/VtbHN6s