Thursday 5 December 2019

ఎట్టకేలకు ఆ సినిమా పూర్తి చేసిన రానా.. నెక్ట్స్‌ ఏంటి?

టాలీవుడ్‌ యంగ్ హీరో రానా పై ఇటీవల చాలా వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ముఖ్యంగా రానా ఆరోగ్య పరిస్థితి విషయంలో అనేక వార్తలు మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే రానా ఆ మాత్రం అవన్నీ పుకార్లంటూ కొట్టి పారేశాడు. కానీ రానా లుక్‌ విషయంలో వచ్చిన మార్పులు అభిమానుల అనుమానాలకు బలం చేకూర్చాయి. తాజాగా మరో దీనికి తోడు రానా సెట్స్‌ మీద ఉన్న సినిమాలను కూడా పక్కన పెట్టేయటంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరినట్టైంది. రానా హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హాథీ మేరీ సాథి సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అవుతుంది. అయితే రానా ఆరోగ్య పరిస్థితి కారణంగా మధ్య చాలా రోజులు పాటు షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. Also Read: రానా విదేశాలకు వెళ్లిపోవటంతో మరికొన్ని సినిమాలు కూడా ఆగిపోయాయి. అయితే ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన రానా తిరిగి షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. హాథీ మేరి సాథి ప్యాచ్‌ వర్క్‌ కూడా పూర్తి చేసిన రానా ఆ సినిమాకు ప్యాక్‌అప్‌ చెప్పేశాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు. ఈ సినిమా తెలుగులో , తమిళ్‌లో కదన్‌ అన్న పేర్లతో రిలీజ్‌ అవుతుంది. Also Read: ప్రభు సోల్మాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జోయా హుస్సేన్‌, శ్రియా పిల్గావ్కర్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు రానా హీరోగా తెరకెక్కిన 1947 అనే సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాను తాను పూర్తి చేయలేదంటూ రానా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చిత్ర నిర్మాతలు మాత్రం సినిమా పూర్తయ్యిందంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా తరువాత తన సొంతం నిర్మాణ సంస్థలో గుణశేఖర్‌ దర్శకత్వంలో భారీ పౌరాణిక చిత్రం హిరణ్య కశ్యపలో నటించేందుకు రెడీ అవుతున్నాడు రానా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PisrJb

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...