Monday, 16 December 2019

ఫ్లాప్‌ హీరోకి వరుస అవకాశాలు.. బడా నిర్మాతలను బుట్టలో వేసుకున్న హీరో!

షార్ట్‌ ఫిలింస్‌తో ఆకట్టుకొని తరువాత వెండితెర మీదకు అడుగుపెట్టిన యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌. అన్నపూర్ణ బ్యానర్‌లో తెరకెక్కిన ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెర మీద కూడా తొలి సక్సెస్‌ అందుకున్నాడు రాజ్‌ తరుణ్‌. తరువాత వరుసగా కుమారి 21 ఎఫ్‌, సినిమా చూపిస్తా మావ సినిమాలు కెరీర్‌కు మంచి బూస్ట్‌ ఇచ్చాయి. అయితే కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న రాజ్‌ తరుణ్‌ తరువాత తడబడ్డాడు. కథ ఎంపికలో చేసిన పొరపాట్లు, మాస్‌ ఇమేజ్‌ కోసం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో వరుస ఫ్లాప్‌లు ఎదురయ్యాయి. దీంతో రాజ్‌ తరుణ్‌ కెరీర్‌ పూర్తిగా గాడి తప్పింది. ఒక దశలో ఇక ఈ యంగ్ హీరో కెరీర్‌ ముగిసినట్టే అన్న ప్రచారం కూడా జరిగింది. Also Read: అయితే అనూహ్యంగా బౌన్స్‌ బ్యాక్‌ అయ్యాడు రాజ్‌ తరుణ్‌. ప్రస్తుతం దిల్ రాజ్‌ బ్యానర్‌లో అనే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా తరువాత కూడా వరుసగా పెద్ద నిర్మాణ సంస్థలతో వరుస సినిమాలు చేస్తున్నాడు రాజ్‌ తరుణ్‌. ఇటీవల ఇద్దరి లోకం ఒకటే సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న రాజ్‌ తరుణ్‌ తన తదుపరి చిత్రాలకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా రిలీజ్‌ తరువాత సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా తెరకెక్కిన బాలీవుడ్‌ సూపర్‌ హిట్ డ్రీమ్‌ గర్ల్‌ రీమేక్‌లో నటించనున్నాడు. Also Read: ఈ సినిమాతో పాటు తనను హీరోగా పరిచయం చేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో శ్రీనివాస్‌ గవిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. దీంతో పాటు గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నట్టుగా వెల్లడించాడు. ఇలా వరుసగా పెద్ద నిర్మాణ సంస్థలతో వరుస సినిమాలు చేస్తున్నాడు రాజ్‌ తరుణ్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PQwbC8

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....