Sunday 1 December 2019

వైరాముత్తు ముద్దుపెట్టుకున్నాడని ఎలా నిరూపించాలి: చిన్మయి శ్రీపాద

పలువురు చెన్నై జర్నలిస్ట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖ సింగర్ . ప్రముఖ లిరిసిస్ట్ వైరాముత్తు తనను లైంగికంగా వేధించాడని మీడయా ముందు బయటపెట్టినందుకు తనను నోటికొచ్చినట్లు తిట్టారని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేశారు. ‘వైరాముత్తు నన్ను లైంగికంగా వేధించాడని నేను బయటపెట్టినప్పుడు తమిళనాడుకు చెందిన కొందరు ప్రజలు, పలువురు జర్నలిస్ట్‌లు నా గురించి నోటికొచ్చినట్లు మాట్లాడారు. నాకు సిగ్గు అనేది మిగిలుంటే చనిపోయి ఉండాల్సింది అన్నారు. నాలాంటి వారి వల్లే నిజంగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు న్యాయం జరగడంలేదని అన్నారు. ఓ ప్రెస్ ‌మీట్‌కి వెళ్లినప్పుడు నేను జుట్టు సరిచేసుకుంటూ ఉంటే కొందరు ఫొటోగ్రాఫర్లు నా చేతులు, వక్షోజాలపై కెమెరాలు జూమ్ చేస్తూ ఫొటోలు తీశారు. నేను టీ షర్ట్, ఫుల్ స్కర్ట్ వేసుకుని ప్రెస్ మీట్‌కు వచ్చానని యూట్యూబ్ ఛానెల్స్‌లో నా ఫొటోలు వేసి ఎగతాళి చేశారు. అత్యాచార ఘటనలపై పట్ల ఎవరైతే బాధపడతారో వారంతా సమాజంలో మార్పును తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నం చేయరు. వారి సర్కిల్‌లో ఎవరికైనా జరిగితే సెక్సిస్ట్ జోక్స్ వేయడంలాంటివి చేయరు. సమాజానికి చనిపోయిన అమ్మాయిలే ఇష్టం. అంతేకానీ ధైర్యంగా పోరాడే అమ్మాయిలను మాత్రం పట్టించుకోదు. నిర్భయ తల్లి మీడియా ముందుకు వచ్చినందుకు కూడా ఆమెపై విమర్శలు గుప్పించారు. అత్యాచార ఘటనలు జరిగినప్పడు పేరున్న పెద్దవాళ్లు బాధితురాళ్ల పట్ల తమ సంతాపాన్ని తెలియజేసినవారు చాలా మంది ఉన్నారు. వారికున్న పేరు ప్రతిష్టలతో బాధితురాళ్లకు సరైన లాయర్లను నియమించినవారు, ఆడపిల్లల కోసం ఎన్జీవోలను నిర్మించినవారు, తమ సోషల్ మీడియా ఖాతాలతో సమాజంలో మార్పులు తెచ్చినవారు ఎంత మంది ఉన్నారో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ’ అని రాసుకొచ్చారు. వైరాముత్తు ఓ గొప్ప లిరిసిస్ట్. అందుకే ఆయన్ను ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. మమ్మల్ని మేం జాగ్రత్త పరుచుకోవడానికి పని, డబ్బు, అవకాశాలు వదులుకోవాల్సి వస్తోంది. 18 ఏళ్ల వయసులో వైరాముత్తు నా నడుం పట్టుకుని నన్ను ముద్దుపెట్టుకోవాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని నన్ను ఎలా నిరూపించుకోమంటారు? ఎక్కడి నుంచి ఆధారాలు తేవాలి? నా కళ్లలో, వక్షోజాల్లో కెమెరాలు పెట్టుకుని తిరగమంటారా? బరి బస్సుల్లోనూ ఆడవాళ్లను ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటున్నారు. నా వక్షోజాలు పట్టుకున్నాడని ఎలా నిరూపించాలి?’ అంటూ వరుస ట్వీట్లను చేశారు చిన్మయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OC9pyh

No comments:

Post a Comment

'Omar Abdullah Is Seen As A Tourist'

'The Abdullah family is the problem and facilitator of the instability that we are seeing in Kashmir.' from rediff Top Interviews ...