సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న అందాల భామ . అరుంధతి, రుద్రమదేవి, భాగమతి లాంటి సినిమాలతో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తోంది. ఇటీవల లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న స్వీటీ, నెక్ట్స్ సినిమాలో మరోసారి మెస్మరైజ్ చేసేందుకు రెడీఅవుతోంది. ప్రస్తుతం అనే క్రాస్ ఓవర్ సినిమాలో నటిస్తోంది అనుష్క. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క పెయింటర్‌గా కనిపించనుంది. ఈ సినిమాలో మాధవన్, అజంలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌లతో పాటు హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి రచయిత కోన వెంకట్ నిర్మిస్తున్నారు. Also Read: ఈ సినిమా తరువాత అనుష్క ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించేందుకు ఓకె చెప్పింది. దర్శకత్వంలో అనుష్క ఓ సినిమా చేయబోతుందన్న వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమా జనవరిలో పట్టాలెక్కనుంది. మిలటరీ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు గౌతమ్ మీనన్. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందనున్న ఈ సినిమాలో అనుష్క భారీ పోరాట సన్నివేశాల్లో నటించనుంది. అందుకోసం ఇప్పటి నుంచే ఆమె ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. జనవరిలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2sjPfAT
No comments:
Post a Comment