యాంకర్ అనసూయకి జీఎస్టి అధికారులు షాకిచ్చారు. పెద్ద మొత్తంలో టాక్స్ కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. సర్వీస్ టాక్స్ కింద పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి పన్ను ఎగవేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి మూడు రోజుల పాటు ప్రముఖ నటులు, నిర్మాతలు, డైరెక్టర్లు, స్టీల్ వ్యాపారుల నివాసాల్లో జీఎస్టీ అధికారులు సోదాలు చేశారు. ఇందులో భాగంగా యాంకర్ అనసూయతో పాటు సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. లావణ్య త్రిపాఠి పన్ను ఎగవేసినట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. అదే విధంగా అనసూయ కూడా పెద్ద ఎత్తున పన్ను ఎగ్గొట్టినట్లు అధికారుల విచారణలో బయట పడింది. దాదాపు 55 లక్షల రూపాయలు జీఎస్టీ కట్టాలని అనసూయకి జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సర్వీస్ ట్యాక్స్ కింద 80 లక్షలు బకాయి ఉన్న అనసూయ... 25 లక్షలు మాత్రమే కట్టినట్లు గుర్తించారు. మిగతా డబ్బు చెల్లించడం కోసం కొంత సమయాన్ని అడిగినట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సర్వీస్ టాక్స్ ఎగ్గొడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే జీఎస్టీ అధికారులు దాడులు చేసి పన్నులు ఎగ్గొడుతున్న వారిని గుర్తించి వాళ్లకు ఫైన్లు వేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అనసూయ కూడా అదే తరహాలో సర్వీస్ టాక్స్ కట్టాలని చెప్పారు. గత రెండు మూడు రోజులుగా పలువురు సెలబ్రిటీల ఇళ్లపై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో యాంకర్లు అనసూయ, సుమల పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ వార్తలపై అనసూయ ఘాటుగా స్పందించింది. ఆదివారం తన ఆస్తులపై ఎలాంటి దాడులు జరగలేదంటూ క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. `మీడియా మిత్రులారా.. నా ఇళ్లు బంజార హిల్స్‌లో లేదు. అలాగే నా ఇంటి మీద ఏ ప్రభుత్వ సంస్థకు చెందిన అధికారులు రైడ్ చేయలేదు. మీడియా అధికారిక సమాచారం ఇవ్వాలిగాని, మీ వ్యక్తిగత అభిప్రాయాలు, ఊహలు వెల్లడించకూడదు. ఈ రంగంలో కొనసాగుతూ పేరు, గౌరవం సంపాదించుకోవడానికి మేం ఎన్నో త్యాగాలు చేస్తున్నాం. బలమైన రంగంమైన మీడియా సమాజానికి మంచి చేస్తూ, మంచి వైపు నడిపించే దిశగా ప్రయత్నించాలి. అంతేగాని ఎంతో కష్టపడి మంచి స్థాయికి చేరుకున్న వ్యక్తుల జీవితాలను గాయపరచకూడదు. నేను మీడియాను గౌరవిస్తాను. మీరు ఓ వార్తను రాసేప్పుడు నిజానిజాలు సరిచూసుకోండి` అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అనసూయ.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MsHnDT
No comments:
Post a Comment