సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగిన యోగా బ్యూటీ . సూపర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ భామ గ్లామర్ రోల్స్‌తో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటింది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలతో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ భామ మరో లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న క్రాస్ ఓవర్ సినిమా నిశ్శబ్ధంలో నటిస్తోంది అనుష్క. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజులతో పాటు హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. Also Read: నిర్మాత, రచయిత కోన వెంకట్ ఈ సినిమాలో అనుష్క పోషిస్తున్న సాక్షి పాత్రకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి చెప్పాడు. `ఈ పాత్ర అనుష్కను దృష్టి పెట్టుకొని రాయలేదు. ఓ స్టార్ హీరోయిన్ కోసం ఈ పాత్రను తయారు చేశాను. అయితే ఓ రోజు ఫ్లైట్‌లో అనుష్క కలిసినప్పుడు క్యాజువల్‌గా కథ వినిపించాను. అనుష్క ఓకే చెప్పటంతో ఈ సినిమా ప్రాజెక్ట్‌లోకి ఆమె వచ్చింది`. అంటూ అసలు విషయాన్ని రివీల్ చేశాడు. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న సినిమాకు వస్తాడు నా రాజు ఫేం హేమంత్ మధుకర్ దర్శకుడు. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొంత కాలంగా ఫిజిక్, లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న అనుష్క ఈ సినిమాలో చాలా కాలం తరువాత స్లిమ్ లుక్‌లో కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33Hx3hf
No comments:
Post a Comment