టాలీవుడ్ స్టార్ కమెడియన్, టెలివిజన్ హోస్ట్ అలీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో కన్నుమూశారు. రాజమహేంద్రవరంలోని ఆమె స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం రాంచీలో షూటింగ్‌లో ఉన్న ఈ వార్త తెలిసి వెంటనే హైదరబాద్ బయలుదేరి వస్తున్నారు. జైతున్ బీబీ భౌతికకాయాన్ని కూడా హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలీ తన తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమానురాగాలు చూపించేవారు. పలు సందర్భా్ల్లో తన ఉన్నతి తల్లిదండ్రులే ప్రధాన కారణమని చెప్పారు. షూటింగ్‌ల నుంచి ఏ మాత్రం ఖాళీ దొరికిన తల్లితో సమయం గడిపేందుకు ఇష్టపడేవారు. అంత గొప్ప నటుడైన ఓ సామాన్యుడిలా తల్లికి సేవలు చేసేవారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PEzv4p
No comments:
Post a Comment