Saturday 7 December 2019

Amma Rajyamlo Kadapa Biddaluకి లైన్ క్లియర్.. ఆరోజే రిలీజ్

ఎట్టకేలకు వివాదాస్పద దర్శకుడు తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విడుదలకు నోచుకుంటోంది. సినిమాకు సెన్సార్ బోర్డు u/a సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సినిమాను డిసెంబర్ 14న విడుదల చేయనున్నారు. ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాకు వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌ పెట్టారు. కానీ ముందుగా ఊహించినట్లుగానే సినిమాకు రాజకీయ సెగ తగిలింది. హైకోర్టు వరకు విషయం వెల్లడంతో వర్మ సినిమాకు ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని టైటిల్‌ను మార్చారు. డైరెక్ట్‌గా ప్రస్తుత రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ చూపించారు. ఈ సినిమాను ప్రకటించినప్పుడే ఎంతో వివాదాస్పదమైంది. సినిమాలో కేఏపాల్‌ను మరీ జోకర్‌గా చూపించడంతో ఆయన వర్మపై కేసు వేశారు. తాను ఎవరినీ ఉద్దేశించి పాత్రలు రూపొందించలేదని ఎంత చెప్పినా, వర్మ అసలు ఉద్దేశం ఏంటో అందరికీ తెలిసిందే. ఆ కారణంగానే సెన్సార్‌ సర్టిఫికేట్‌ విషయంలో ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ విషయంలో వర్మ మాత్రం పట్టు వీడటంలో లేదు. ఇప్పటికే సెన్సార్‌ బోర్డ్‌ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు వర్మ. `మేం ఎలాంటి సినిమాలు చూడాలో వారు ఎలా నిర్ణయిస్తారు. నన్ను ఎంత తొక్కితే అంత రెచ్చిపోతా. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సీక్వెల్‌ కూడా తీస్తా` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి వర్మ తన పంతాను నెగ్గించుకున్నాడు. సినిమాను డిసెంబర్ 14న వదలనున్నాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రాజకీయ పరంగా ఎంత ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాతో వర్మ ఎవర్ని బుక్ చేయనున్నారో వేచి చూడాలి. See Photo Story :


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2DRn8v7

No comments:

Post a Comment

'We Lost So Many Things In This War'

'The war ended in 2009 and I believe the new generation of Tamils don't know what was going on there.' from rediff Top Intervi...