దేవీశ్రీ ప్రసాద్ తన సంగీతంతో సౌత్ ఇండియా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. కోడి రామకృష్ణ ‘దేవి’ సినిమాతో కెరీర్‌ను మొదలుపెట్టిన దేవీశ్రీ.. ఆదినుంచీ ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేశారు. మంచి ఆల్బమ్స్ ఇస్తూ స్టార్ హీరోలను సైతం ఆకర్షించారు. అల్లు అర్జున్‌తో చేసిన ‘ఆర్య’, మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలు దేవీకి మంచి బ్రేక్ ఇచ్చాయి. ఇక అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. తెలుగు, తమిళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేశారు. టాలీవుడ్‌లో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇప్పటికే ఎనిమిది ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్న దేవీశ్రీ ప్రసాద్.. తాజాగా మరో ఫిలిం ఫేర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా చెన్నైలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఫిలిం ఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘రంగస్థలం’ చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా 9వ ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్నారు దేవి. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో అత్యధికంగా ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న సంగీత దర్శకుడిగా దేవీశ్రీ నిలిచారు. ఆయన తరవాత స్థానంలో యం.యం.కీరవాణి ఉన్నారు. కీరవాణి ఇప్పటి వరకు 7 ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. Also Read: ఇదిలా ఉంటే, దేవీశ్రీ ప్రసాద్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’తో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం కోసం దేవి మంచి ట్యూన్స్ అందించారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు ఆంథమ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ థీమ్ సాంగ్‌ని మేసెడోనియన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో కలిసి దేవి రికార్డ్ చేయడం విశేషం. శంకర్ మహదేవన్ ఈ పాటని ఆలపించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2sRga79
No comments:
Post a Comment