టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు జనాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. భర్త నాగ చైతన్యతో విడాకుల విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించిన తర్వాత సామ్ వెళుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. తనకిష్టమైన స్నేహితులతో ప్రపంచాన్ని చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. తన కెరీర్ విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమంతకు పుషింగ్ అందుతోందని తెలుస్తుండటం ఆసక్తికర అంశం. ఇకపై కెరీర్ పరంగా తగ్గేదే లే.. అన్నట్లుగా దూసుకుపోవాలని డిసైడ్ అయిందట సమంత. ఈ మేరకు బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలకు ఆమె సంతకాలు చేస్తోంది. ఇటీవలే శ్రీదేవి మూవీస్ సినిమా, డ్రీమ్ వారియర్ సినిమా బ్యానర్‌పై వచ్చే సినిమాలకు పచ్చ జెండా ఊపిన ఈ సుందరి.. బాలీవుడ్‌లో పాగా వేయాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసిందట. ఇప్పటికే ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2లో రాజీ పాత్రతో మెప్పించిన సామ్, బీటౌన్ ఆడియన్స్ మనసు దోచుకోవాలని బలంగా ఫిక్సయిందట. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమా కోసం తాప్సీ పన్ను ప్రొడక్షన్ హౌస్‌తో చర్చలు జరుపుతున్నట్లు టాక్ బయటకొచ్చింది. తాప్సీ ఔట్ సైడర్స్ ఫిల్మ్స్ బ్యానర్‌లో సమంత ప్రధాన పాత్రలో హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారని సమాచారం. ఇకపోతే రీసెంట్‌గా గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా కంప్లీట్ చేసిన సమంత.. తమిళంలో 'కాతువాక్కుల రెండు కాదల్' మూవీ ఫినిష్ చేసింది. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగులో నాని హీరోగా రాబోతున్న దసరా అనే సినిమాలో కూడా సమంత నటించనుందని టాక్ నడుస్తోంది. సో.. చూడాలి మరి రాబోయే రోజుల్లో సమంత కెరీర్ ఎలా ముందుకు సాగుతుందో!.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZyXWHL
No comments:
Post a Comment