శనివారం (నవంబర్ 21) ఉదయం 9 గంటల 47 నిమిషాలకు టాలీవుడ్ యువ కథానాయకుడు గుమ్మకొండ తన చిన్ననాటి స్నేహితురాలు లోహితను వివాహం చేసుకున్నారు. కార్తికేయ, వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ నిట్‌లో కలిసే చదువుకున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. తర్వాత కార్తికేయ హీరో అయిన తర్వాత వీరి ప్రేమ కొనసాగుతూ వచ్చింది. హీరోగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న కార్తికేయ, లోహిత ఇరువురు తమ తల్లిదండ్రులను ఒప్పించి ఇంటివారయ్యారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత రీసెంట్గా కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ లోహితకు స్టేజ్‌పైనే ప్రపోజ్ కూడా చేశాడు. ఈరోజు పెద్దలు, సినీ సెలబ్రిటీలు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో లోహితను హైదరాబాద్‌లో కార్తికేయ ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ సహా సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, తనికెళ్ల భరణి తదితరులు విచ్చేసి వధువరులను ఆశీర్వదించారు. తొలి చిత్రం RX 100. ఇన్టెన్స్ లవ్‌స్టోరిగా రూపొందిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో హీరోగా కార్తికేయకు మంచి పేరు వచ్చింది. మాస్ హీరోలా కనపడటం, మంచి ఫిజిక్ ఉండటంతో కార్తికేయకి వరుస అవకాశాలు వచ్చాయి. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గా కూడా నటిస్తూ కార్తికేయ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే నాని హీరోగా చేసిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో కార్తికేయ విలన్‌గా నటించాడు. ఇప్పుడు అజిత్ హీరోగా చేసిన వలిమై చిత్రంలోనూ కార్తికేయ విలన్‌గా నటించడం విశేషం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3CDp327
No comments:
Post a Comment