Saturday, 20 November 2021

Kaikala Satyanarayana : కైకాల స‌త్య‌నారాయ‌ణ స్పృహ‌లోకి రావ‌డం ఆనందంగా ఉంది: చిరంజీవి

టాలీవుడ్ సీనియర్ నటుడు శుక్ర‌వారం ఉద‌యం అనారోగ్యంతో హైద‌రాబాద్‌లోని అపోలో హాస్పిట‌ల్లో జాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, అవ‌య‌వాల‌ను స‌రిగ్గా స్పందించ‌డం లేదంటూ, కొంద‌రు డాక్ట‌ర్స్ బృందం స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్యంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారంటూ సాయంత్రానికి అపోలో డాక్ట‌ర్స్ ప్రెస్‌నోట్‌ను కూడా విడుద‌ల చేశారు. అయితే తాజాగా టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడైన కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్యానికి సంబంధించి అప్‌డేట్‌ను తెలియ‌జేశారు. ‘‘ఐసీయూలో చికిత్స పొందుతున్న కైకాల స‌త్య‌నారాయ‌ణ‌గారు స్పృహ‌లోకి వ‌చ్చార‌ని తెలియ‌గానే ఆయ‌న్ని ట్రీట్ చేస్తున్న డాక్ట‌ర్ సుబ్బారెడ్డిగారి స‌హాయంతో ఫోన్‌లో ప‌ల‌క‌రించాను. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకుంటార‌న్న పూర్తి న‌మ్మ‌కం క‌లిగింది. ట్రాకియా స్టోమి కార‌ణంగా ఆయ‌న మాట్లాడ‌లేక‌పోయినా మ‌ళ్లీ త్వ‌ర‌లో ఇంటికి రావాల‌ని, ఆ సంద‌ర్భాన్ని అంద‌రం సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని, నేను అన్న‌ప్పుడు ఆయ‌న న‌వ్వుతూ థంప్స్ అప్ సైగ చేసి థాంక్యూ అని చూపించిన‌ట్లు డాక్ట‌ర్ సుబ్బారెడ్డిగారు తెలిపారు. ఆయ‌న సంపూర్ణ ఆయురారోగ్యాల‌తో తిరిగి రావాల‌ని ప్రార్థిస్తూ ఆయ‌న అభిమానులు, శ్రేయోభిలాషులంద‌రితో ఈ విష‌యం పంచుకోవ‌డం సంతోషంగా ఉంది’’ అన్నారు చిరంజీవి. కైకాల సత్యనారాయణ దాదాపు 800 చిత్రాల్లో హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, ప్ర‌తి నాయ‌కుడిగా, క‌మెడియ‌న్ ఇలా అన్నీ ర‌కాల ప్రాత‌ల‌ను పోషించి త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. 60 సంవత్సరాలుగా తెలుగు సినిమారంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశారు. అలాగే హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1996లో మ‌చిలీప‌ట్నం లోక్‌స‌భకు ఎన్నిక‌య్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3CwsQ1e

No comments:

Post a Comment

'India In 1947 Was A Ticking Time Bomb'

'When you watch Freedom At Midnight, I want you to feel like you are sitting on a ticking time bomb.' from rediff Top Interviews h...