Monday, 22 November 2021

నాగార్జున రూంలోకి ఎంటర్ అయ్యారంటే! 'అనుభవించు రాజా' హీరోయిన్ కామెంట్స్ వైరల్

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘’. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరోయిన్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలపై ఓపెన్ అయింది. ''మొదట ఈ సినిమా ఆడిషన్స్ కోసం నన్ను పిలిస్తే అస్సలు నమ్మలేదు. దాదాపు మూడు నెలలు రిప్లై కూడా ఇవ్వలేదు. ఎట్టకేలకు రిప్లై ఇచ్చాక ఆడిషన్ చేయగా సెలెక్ట్ అయ్యా. నాకిదే తొలి సినిమా. లైట్స్, కెమెరా అంటే ఏంటో కూడా తెలియని నాకు రాజ్ తరుణ్ ఎంతో సహకరించారు. అన్ని విషయాల్లో సాయం చేశారు. అయన ప్రోత్సాహంతో పక్కింటి అమ్మాయిలా మంచి పాత్రలో నటించాను. నా మొదటి చిత్రం అన్నపూర్ణ బ్యానర్‌లో రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నన్ను సెలెక్ట్ చేసినందుకు ముఖ్యంగా సుప్రియ మేడంకు థ్యాంక్స్. ఆమె లేడీ బాస్. సెట్‌లో అందరినీ బాగా చూసుకునే వారు. డైరెక్టర్ శ్రీనుకు క్లియర్ విజన్ ఉంది. ఏం కావాలనేది ఆయనకు బాగా తెలుసు. అందుకే ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేశారు. అవుట్‌ఫుట్ ఎంత బాగా వచ్చిందనేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. కామెడీ, యాక్షన్, ఎమోషన్, లవ్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో కూడిన సినిమా ఇది. షూట్ కోసం తెలుగు నేర్చుకున్నా. డబ్బింగ్‌లో తెలుగు సినిమాలు చూశాను. నాకు రవితేజ అంటే చాలా ఇష్టం. యాక్టర్ అయితే ఈ ఒక్క జీవితంలోనే ఎన్నో పాత్రలను పోషించవచ్చు. అందుకే నేను నటిగా మారాను.నా మొదటి సినిమా విడుదల కాబోతోందన్న ఆనందంగా ఉంది. అలాగే నర్వస్‌గా ఫీలవుతున్నాను. తెలుగు భాష కూడా చాలెంజింగ్‌గా అనిపించింది. గారు రూంలోకి ఎంట్రీ అయ్యారంటే అందరూ ఆయన్ను చూస్తుంటారు. నేను ఫస్ట్ టైమ్ నాగార్జున గారిని చూసి ఆశ్చర్యపోయాను. ఆయన నా ముందున్నారా? అనే ఫీలింగ్‌‌లో ఉండిపోయాను. ఈ సినిమా మొదటి నుంచి సుప్రియ మేడం మాతో ప్రయాణించారు. ఆమె ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు'' అని కశిష్ ఖాన్ చెప్పుకొచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3l2ZYrE

No comments:

Post a Comment

'If Pawar Tells Me To Jump In A Well...'

'The reason I am not anxious about the opponent facing me in the front (Ajit Pawar) is because of who is standing behind me like a rock ...