Thursday, 24 June 2021

నటనకు గుడ్ బై చెప్పబోతున్న రాధ కూతురు.. యంగ్ హీరోయిన్ షాకింగ్ డిసీజన్! కారణం ఇదే..

స్టార్ కిడ్స్ సినీగడప తొక్కి పాపులర్ కావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. తమపై పెట్టుకున్న అంచనాలు రీచ్ అయ్యేలా పక్కాగా ప్లాన్ చేస్తుంటారు. కానీ సీనియర్ హీరోయిన్ రాధ వారసురాలిగా చిత్ర రంగప్రవేశం చేసిన హీరోయిన్‌ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తోందట. ఆశించిన మేర అవకాశాలు రాకపోవడంతో ఇక పూర్తిగా నటనకు గుడ్ బై చెప్పాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే ఆ విషయాన్ని అఫీషియల్‌గా చెప్పాలని డిసైడ్ అయిందట కార్తీక. నాగ చైతన్య హీరోగా వచ్చిన 'జోష్' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కార్తీక. రాధ కుమార్తెగా పదిహేడేళ్ళ వయసులో ఆమె ఎంట్రీ బాగానే వర్కవుట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఆమె నటనను గాను పలు అవార్డ్స్ వచ్చాయి కాబట్టి. కానీ సీన్ రివర్స్ అయింది. ఆ సినిమా తర్వాత వెంటనే అవకాశాలు రాకపోలేదు సరికదా తల్లి రాధ ఇమేజ్‌ కూడా కార్తీకకు ప్లస్ కాలేదు. ఆ వెంటనే కార్తీక నటించిన ‘అన్నకొడి’, ‘పురంబోక్కు’ వంటి చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. అలాగే, అరుణ్‌ విజయ్‌ సరసన నటించిన ‘వా డీల్‌’ అనే చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఆపై ఓ హిందీ సీరియల్‌లో కూడా నటించి బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది కార్తీక. ఇది కూడా ఆమెకు లైఫ్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన కార్తీక.. ఇక సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చాలా సంవత్సరాల పాటు ఆఫర్స్ కోసం ఎదురుచూశాక ఆమెకు నటనపై విరక్తి కలిగిందని, దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పాలని ఆమె ఫిక్సయినట్లు టాక్ నడుస్తోంది. ఇకపోతే తన ఫోకస్ అంతా బిజినెస్‌పై పెట్టాలని కార్తీక డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. యుటిఎస్ గ్రూపుల హోటళ్లను నడుపుతున్నందున ఇప్పుడు తన వ్యాపారంపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నానని ఆమెనే స్వయంగా వెల్లడించడంతో ఈ ఇష్యూ వైరల్ అవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jgTk0H

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....