చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడంతో ఉండే కిక్కేవేరు. మనకు మనం గుర్తు తెచ్చుకోవడమే గాక, ఇతరులకు చూపెడుతూ ఆ మూమెంట్స్‌లోకి వెళ్లిపోవడం ఎంతో ఆనందాన్నిస్తుంటుంది. అలాంటి సందర్భాన్నే మెగా అభిమానులతో పంచుకున్నారు నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ . ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చెల్లెలు నిహారికతో పాటు పెదనాన్న చిరంజీవితో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన వరుణ్ తేజ్.. 'డౌన్ టు మెమోరీ లేన్' అంటూ కామెంట్ చేశారు. చిన్నారిగా కనిపిస్తున్న నిహారికను ఎత్తుకోగా, పక్కనే వరుణ్ నవ్వుతూ కనిపిస్తున్నారు. మెగా వారి మెమొరబుల్ పిక్ కావడంతో ఈ ఫొటోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. 'బుల్లి నిహారికతో బిగ్ బాస్' అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి చేతుల్లో చిన్నారిగా కనిపిస్తున్న నిహారిక.. ఇప్పుడు ఓ ఇల్లాలు. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యను పెళ్లాడిన మెగా డాటర్, అత్తారింట్లో హాయిగా ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు పలు సినిమాల్లో కనిపించిన ఆమె పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో హంగామా చేయడం ప్రారంభించింది. ఎప్పటికప్పుడు తన భర్తతో దిగిన ఫొటోస్ షేర్ చేస్తూ మెగా అభిమానుల్లో జోష్ నింపుతోంది. అంతేకాదు పెళ్లి తర్వాత మళ్లీ వెబ్ సిరీస్‌లతో బిజీగా మారడం విశేషం. మరోవైపు వరుణ్ తేజ్ సైతం తన పాపులారిటీని పెంచుకుంటూ వరుస బ్లాక్‌బస్టర్స్ ఖాతాలో వేసుకుంటున్నారు. గద్దలకొండ గణేష్ సినిమాతో మాస్ ఆడియన్స్‌ని ఫిదా చేసిన ఆయన, ప్రస్తుతం 'గని' మూవీలో నటిస్తున్నారు. వరుణ్ కెరీర్‌లో 10వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు వెంకటేష్‌తో కలిసి ఫన్ రైడ్ F3 మూవీ చేస్తున్నారు వరుణ్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sPkqOp
No comments:
Post a Comment