ఇండియన్ వైడ్ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ నుంచి సరికొత్త అప్‌డేట్స్ ఇస్తూ ఇప్పటికే ఉన్న అంచనాలకు రెక్కలు కడుతున్నారు రాజమౌళి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు (ఏప్రిల్ 2) అజయ్ దేవగణ్ పుట్టినరోజు కానుకగా ఆయన లుక్ రివీల్ చేస్తూ సర్‌ప్రైజింగ్ పోస్టర్‌తో పాటు ఆయన క్యారెక్టర్‌కి సంబంధించిన మోషన్ పోస్టర్ వదిలారు జక్కన్న. ఈ మోషన్ పోస్టర్‌లో అజయ్ దేవగణ్ చుట్టూ తుపాకీ గుళ్ళు ఎక్కుపెట్టినట్లు చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో అదరగొట్టేశారు. ఒక్కసారి చూస్తే సరిపోదు.. మళ్ళీ మళ్ళీ చూడాలి అన్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయింది. దీనిపై రియాక్ట్ అయిన ఎన్టీఆర్.. అజయ్ దేవగణ్ నెవర్ బిఫోర్ లుక్ అంటూ కామెంట్ చేశారు. దాదాపు 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయించి డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్ రోల్ కీలకం కానుందట. చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ ఆడిపాడుతోంది. రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఇటీవలే విడుదలైన రామరాజు లుక్ సినిమాపై ఓ రేంజ్ హైప్ తెచ్చిపెట్టగా.. తాజాగా విడుదలైన దానికి రెక్కలు కట్టింది. ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా 1920 బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో శ్రియ, సముద్రఖని, హాలీవుడ్ తారలు ఎలిసన్ డ్యూడీ, రేయ్ స్టీవెన్‌సన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rKvWsU
No comments:
Post a Comment