Thursday 1 April 2021

RRR కళ్లు చెదిరే బిజినెస్.. రికార్డులు తిరగరాస్తున్న మెగా, నందమూరి వారసులు!!

వరల్డ్ వైడ్ ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ విడుదలకు ముందే సెన్సేషన్ అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. దీనికి తోడు ఎప్పటికప్పుడు దర్శకుడు రాజమౌళి వదులుతున్న అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి చూపు RRR రిలీజ్‌పైనే పడింది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. RRR మూవీకి సంబంధించి బిజినెస్ డీల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలుపుకొని ఈ సినిమా 900 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. పాన్ ఇండియా మూవీ, యువ స్టార్ హీరోల కాంబో పైగా రాజమౌళి రూపొందిస్తున్న సినిమా కావడంతో మార్కెట్‌లో ఈ సినిమాకు భారీ డిమాండ్ చేకూరిందని ట్రేడ్ వర్గాలు అంటున్న మాట. దాదాపు 450కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్ సంస్థలు పోటీ పడుతున్నాయట. ఇటీవల RRR తమిళ థియేట్రికల్ హక్కులను లైకా ప్రొడక్షన్ సంస్థ దక్కించుకోగా.. కర్ణాటకలో ఏషియన్, వారాహి సంస్థలు ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నాయి. ఇక తాజాగా నార్త్ మొత్తం రిలీజ్ హక్కులను పెన్ స్తూడియోస్ చేజిక్కుంచుకుంది. హిందీ భాషకు సంబంధించిన డిజిటల్ హక్కులు కూడా ఈ సంస్థకే దక్కాయి. ఈ విషయాన్ని స్వయంగా పెన్ స్టూడియోస్ వారు ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 570 కోట్లకు పైగా అమ్ముడుపోయాయని, అలాగే డిజిటల్ శాటిలైట్ రైట్స్ రూపంలో మరో 300 కోట్లు సమకూరాయనేది ట్రేడ్ వర్గాల మాట. దాదాపు 600 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకొని ఈ సినిమా బరిలోకి దిగుతోందట. చూడాలి మరి మెగా, నందమూరి కాంబోలో రాబోతున్న ఈ మూవీ విడుదల తర్వాత ఏ రేంజ్‌లో వసూళ్ల సునామీ సృష్టిస్తుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31BTVQG

No comments:

Post a Comment

'Varun Was Hanging, Upside Down...'

'Varun was so exhilarated with the intense physical action sequences.' from rediff Top Interviews https://ift.tt/KGJTEap