అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఇన్ని రోజులు అప్డేట్ అంటూ రచ్చ రచ్చ చేసిన అభిమానులను కూల్ చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ అదిరిపోయే ప్లాన్ వేసింది. బన్నీ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా వారం మొత్తం పుష్ప సందడి ఉండేలా ప్లాన్ చేశారు. ఈ మేరకు పుష్ప నుంచి అదిరిపోయే అప్డేట్‌లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. లోడ్ దింపతాండం అంటూ చిత్తూరు యాసలో నిన్న ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ అప్డేట్ ఇచ్చారు. అదిరిపోయే వారం ముందుంది అంటూ పుష్ప అప్డేట్ గురించి హింట్ ఇచ్చారు. ఆ తరువాత కొద్ది సేపటికే పుష్ప రాజ్ గురించి మరో విషయం చెప్పేశాడు. ప్రిల్యూడ్ ఆఫ్ పుష్ప రాజ్ అంటూ మరో అప్డేట్ ఇచ్చారు. నేటి ఉదయం 11 గంటలకు పుష్పను పరిచయం చేయబోతోన్నామంటూ నిన్న ఇచ్చిన అప్డేట్‌తో అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తూ వచ్చారు. మొత్తానికి ఆ తరుణం రానే వచ్చింది. పుష్ప నుంచి పుష్ప రాజ్‌ను చిత్రయూనిట్ ప్రపంచానికి పరిచయం చేసింది. పుష్ప రాజ్ పరిచయం అంటూ వదలిన ఈ చిన్న వీడియో అదిరిపోయింది. ఇందులో బన్నీ మొహన్ని క్లియర్‌గా చూపించలేదు. పుష్ప రాజ్‌ను ఏప్రిల్ 7న సాయంత్రం 6: 12 గంటలకు చూపిస్తామమని తెలిపారు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతమందించనున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ మొదటిసారిగా ప్యాన్ ఇండియన్ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీ ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QS07BN
No comments:
Post a Comment