నవీన్ పొలిశెట్టి హీరోగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. విడుదలకు ముందే సినిమాకి విపరీతమైన హైప్ రావడంతో.. బాక్సాఫీస్ వద్ద సినిమా భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సులు కొల్లగొట్టాడు దర్శకుడు కేవీ అనుదీప్. సినిమాలో ఉన్న కామెడీ కంటే.. సినిమా ప్రమోషన్లలో భాగంగా అనుదీప్ పాల్గొన్న ఇంటర్వ్యూలలో అతను ఇచ్చిన ఫన్నీ సమాధానాలకు పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఏర్పడింది. పాల్గొన్న ప్రతి ఈవెంట్ లేదా ఇంటర్య్వూలో ఆమాయకంగా మాట్లాడుతూనే.. ఫన్నీగా సెటైర్లు వేస్తూ.. అనుదీప్ హీరోలతో సమానమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే అందరిపై పంచ్‌లు వేసే అనుదీప్‌కి.. ‘జాతి రత్నాలు’ చిత్ర నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్‌లు ఊహించని షాక్ ఇచ్చారు. అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించి.. తమకు కాసుల పంట అందించిన అనుదీప్‌కి నిర్మాతలు ఏకంగా లాంబోర్గిని కారుని బహుకరించారు. అయితే అది నిజమైన కారు కాదు.. లాంబోర్గిని కారును పోలిన బొమ్మ కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా అందరినీ తన స్టైల్ పంచ్‌లతో ఓ ఆటాడుతున్న అనుదీప్‌కి ప్రొడ్యూసర్లు.. సూపర్ పంచ్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరు అనుదీప్ కారు గిఫ్ట్‌గా తీసుకుంటున్న ఫొటోతో మీమ్స్ చేయడంతో అవి ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2POeW82
No comments:
Post a Comment