Saturday, 3 April 2021

అతనూ సీఎం జగన్ లాంటి వాడే.. తాట తీస్తా, రెండో యాంగిల్ చూపించానా ఇక అంతే! శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్

తమిళనాట రాజకీయ వేడి కొనసాగుతోంది. కేంద్రంపై డీఎంకే చేస్తున్న కామెంట్స్, డీఎంకే నేతలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు దేశవ్యాప్త సంచలనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే సీనియర్ నటుడు, తమిళనాడు బీజేపీ నేత చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. యువ హీరో, డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కి సౌతిండియన్ స్టార్ హీరోయిన్ నయనతారతో ఎఫైర్ ఉందంటూ ఆయన కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నయనతారతో ఉదయనిధి స్టాలిన్ సహజీవనం చేస్తున్నాడని ఆయన మాట్లాడటం హాట్ టాపిక్ అయింది. అయితే వెంటనే ఈ ఇష్యూపై రియాక్ట్ అయిన గాయని చిన్మయి.. రాధారవి చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. ఉదయనిధి, నయనతార గురించి తప్పుగా మాట్లాడటం సరికాదంటూ ఆయనపై ధ్వజమెత్తింది. ఈ క్రమంలో ఇదే ఇష్యూపై తాజాగా సెన్సేషనల్ క్వీన్ స్పందించడంతో జనాల్లో చర్చలు మరింత ముదిరాయి. ఏకంగా ఓ వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి.. ఉదయనిధి స్టాలిన్‌ని ఉద్దేశిస్తూ పలు కామెంట్స్ చేసింది. చాలా చాకచక్యంగా రాధారవి పేరు తీయకుండానే వాడేవడో ఉదయనిధి స్టాలిన్ గురించి చెత్త వాగుడు వాగుతున్నాడంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. స్టాలిన్ తనకు అన్న లాంటి వాడని చెప్పిన ఆమె, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎంత మంచివాడో ఉదయనిధి స్టాలిన్ కూడా అలాంటి వాడే అని పేర్కొంది. అతను చాలా మంచివాడని, ఎవరైనా అతని గురించి తప్పుగా మాట్లాడారా తాట తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి. తమిళనాడును డీఎంకే మాత్రమే అభివృద్ది చేస్తుందని, ఆ సత్తా స్టాలిన్‌కు మాత్రమే ఉందని శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఎదురించి మాట్లాడేగల ధైర్యమున్నవాడు ఉదయనిధి స్టాలిన్ అంటూ తెగ పొగిడేసింది శ్రీ రెడ్డి. కాగా.. డబ్బులు తీసుకొని ఇలా మాట్లాడుతున్నానని ఎవడైనా ట్రోలింగ్‌కి దిగాడా నా రెండో యాంగిల్ బయటపెడతానంటూ శ్రీ రెడ్డి గట్టి వార్నింగ్ ఇవ్వడం విశేషం. చివరగా తన సపోర్ట్ డీఎంకేకే అని తెలుపుతూ వీడియో ముగించింది శ్రీ రెడ్డి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cLiS2o

No comments:

Post a Comment

'When I Got The Paatal Lok Demo...'

'...it was for a very, very big lead actor.' from rediff Top Interviews https://ift.tt/hlYgKLd