ఎంత గొప్పగా తిరిగాము, ఎంతమంది దేవతలకు విలువైన కానుకలు సమర్పించాం అన్నది కాదు.. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడంలోనే అసలైన దైవత్వం ఉంటుంది. అచ్చం అలాగే టాలెంట్ ఉండి సినిమాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి కలలను సాకారం చేస్తూ, వారికి వెన్నంటి నిలవడంలోనూ గొప్ప గౌరవం దాగి ఉంటుంది. సరిగ్గా అదే చేయబోతున్నారు పవర్ స్టార్ . యంగ్ టాలెంటెడ్ క్రియేటర్స్‌ని ఎంకరేజ్ చేయడం కోసం భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నారు పవన్. నిజానికి ఈ సమాజంలో ఎంతో టాలెంట్ దాగి ఉంది. ఎందరో క్రియేటర్స్ సరైన అవకాశం దొరకక అక్కడే ఉండిపోతున్నారు. అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తూ చివరకు ఆశయాన్ని చంపుకొని వేరే రంగంలో స్థిరపడుతున్నారు. అయితే అలాంటి వాళ్ళందరి కోసం నడుం బిగించారు పవన్ కళ్యాణ్. నవతరం ఆలోచనలు కలిగిన రచయితలు, వైవిధ్యభరితమైన కథలు చెప్పగలిగే దర్శకులను, అలాగే నటనా ప్రతిభ ఉన్న ప్రతిఒక్కరినీ ప్రోత్సహించాలనే సదుద్దేశంతో పవర్ స్టార్ సొంతంగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ స్థాపించారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్, నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి బ్యానర్స్ సంయుక్తంగా యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడానికి పూనుకున్నాయి. కొత్త టాలెంట్ ఉన్న వాళ్లతో ఏకంగా 15 సినిమాలను నిర్మించబోతున్నారు. ఇందులో 6 పరిమిత చిన్న తరహా చిత్రాలు, 6 మధ్యతరహా చిత్రాలు, 3 భారీ చిత్రాలు ఉండనున్నాయి. యువ ప్రతిభావంతుల ఆలోచనలను ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలిచేలా పవన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఇది పవర్ స్టార్ వ్యక్తిత్వానికి నిదర్శనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఓ వైపు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూనే చకచకా తన సినిమాలు ఫినిష్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్' డబ్బింగ్ కూడా ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయిన పవన్.. క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు', అలాగే రానాతో కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాలతో బిజీగా ఉన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cLtFtp
No comments:
Post a Comment