Saturday, 24 April 2021

‘రంగస్థలం’ సీక్వెల్‌కి సన్నాహాలు.. మాకొద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!

మెగాపవర్ స్టార్ హీరోగా, దర్శకుడు రూపొందించిన క్లాసిక్ చిత్రం ‘’. ఈ సినిమాలో సౌండ్ ఇంజనీర్ చిట్టుబాబు పాత్రలో అద్భుతంగా నటించిన రామ్ చరణ్.. ప్రతీ ఒక్కరి అభినందనలు అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక రామ్ చరణ్ మాత్రమే కాదు.. ప్రతీ పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. 2018లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్ అవ్వడమే కాక.. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నారనే వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అతను సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయనున్నాడు. అయితే సుకుమార్, రామ్ చరణ్ దర్శకత్వంలో మళ్లీ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగస్థలం సీక్వెల్ వార్తలు కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. అయితే ఈ సినిమా సీక్వెల్ మాత్రం మాకొద్దు బాబోయ్ అంటూ మెగా పవర్ స్టార్ అభిమానులు అంటున్నారట. నిజానికి రంగస్థలం సినిమా తెలుగు తెరపై ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవాలి. అలాంటి సినిమాకు సీక్వెల్‌ని రూపొందిస్తే.. మొదటి భాగంలో ఉన్న ఫ్లేవర్ పోకుండా చూసుకోవాలి. ఏ మాత్రం తేడా కొట్టినా.. సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో మరే సబ్జెక్ట్‌తో సినిమా తీసినా ఫర్వాలేదు కానీ, రంగస్థలంను మాత్రం టచ్ చేయవద్దని అభిమానులు కోరుతున్నారట. ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఇప్పటికే సినిమాలను ప్రకటించాడు. దీంతో చరణ్-సుకుమార్ కాంబోలో ఇప్పట్లో సినిమా వచ్చే అవకాశాలు లేవు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eueKmV

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw