Wednesday 11 November 2020

వీధి కుక్కలన్నీ కలిసి కట్టుగానే ఉంటాయి.. దేవుళ్లందరూ నెపోకిడ్సే! నెపోటిజంపై పూరి జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు

గత కొంతకాలంగా తన ఆలోచనలకు పదును పెడుతూ సమాజంలోని పలు విషయాలపై వివరణ ఇస్తూ పోడ్ కాస్ట్ ఆడియోలతో హల్చల్ చేస్తున్నారు డాషింగ్ డైరెక్టర్ . ఈ క్రమంలోనే తాజాగా సినీ ఇండస్ట్రీలో నెపోటిజం (బంధు ప్రీతి) అంశంపై స్పందిస్తూ తనదైన స్టైల్‌లో కామెంట్స్ చేశారు. పిక్కల్లో బలం ఉన్నవాడిని ఎవ్వరూ ఆపలేరంటూ ఆయన చెప్పిన విషయంలో ప్రతి ఒక్కరినీ వెన్నుతట్టి ప్రోత్సహించేలా ఉన్నాయి. నెపోటిజం అంటే.. పవర్‌లో లేదా ఒక పొజీషన్‌లో ఉన్నోడు తన బంధువులు, తనకు తెలిసినోళ్లకు మాత్రమే జాబ్స్ ఇవ్వడం లేదా వాళ్లకే అవకాశాలు అవ్వడం అని పేర్కొన్న పూరి జగన్నాథ్.. ''ఒక జాతి పక్షులు ఒకచోట చేరుతాయి. ఒక వీధిలో కుక్కలన్నీ కలిసి ఉంటాయి. వేరే కుక్కలను దగ్గరకు రానీయవు. మీ అమ్మ చేతిలో ఒకే ఒక రొట్టె ఉంటే మీ అమ్మ నిన్ను మాత్రమే చంకనెత్తుకొని నీకు మాత్రమే తినిపిస్తుంది. అదే నెపోటిజం. పక్కింటి కుర్రాడు ఆకలితో వచ్చి మీ అమ్మ వైపు బేలగా చూస్తుంటాడు. మీ అమ్మ జాలిపడి వాడికో చిన్న రొట్టెముక్క ఇస్తుంది. ఎందుకంటే వాడు మీ అమ్మ స్నేహితురాలి కొడుకు కాబట్టి. అదే రోడ్డు అవతల ఉన్న కుర్రాడు ఆకలితో వాళ్ళ దగ్గరికి పరుగెత్తుకుంటే వస్తే.. వాడు ఎక్కడ రొట్టె ఎత్తుకెళ్తాడో అని నిన్ను, నీ పక్కింటి కుర్రాడిని తీసుకొని గుడిసెలోకి లోకి తీసుకెళ్లి తలుపేస్తుంది. అప్పుడు వాడు అరుస్తాడు.. నెపోటిజం నశించాలి అని. Also Read: రొట్టె ఎక్కడ ఉంటే అక్కడికి చేరుతారు అందరూ. కోట్ల ఆస్థి సంపాదించి మీ నాన్న దాన్ని నీకు మాత్రమే రాయడమెందుకు..? నాకు రాయొచ్చుగా!. మా నాన్న అప్పులు చేసి చచ్చిపోతే ఆ అప్పులు నేనే ఎందుకు కట్టాలి? ఏ నువ్వు కూడా కట్టొచ్చుగా!. దారిద్ర్యాన్ని ఎవ్వరూ పంచుకోరు. రిక్షావాడి కొడుకు రిక్షా తొక్కుతుంటే నేనూ తొక్కుతా అని ఎవ్వడూ అనడు. అదే హీరో కొడుకు హీరో అవుతే నేనూ అవుతా అని ముందుకొస్తారు. సక్సెస్‌ని, డబ్బుని చూస్తే మాత్రమే నెపోటిజం గుర్తొస్తుంది. కానీ అది జలసీ అంతే. నెపోటిజం అనగానే అందరికీ సినిమా ఫీల్డే గుర్తొస్తుంది.. బంధుప్రీతి సినిమా ఇండస్ట్రీలోనే ఉందా? రాజకీయాల్లో లేదా? బిజినెస్‌లో లేదా? అయోధ్యను రాముడి చేతిలోనే పెడతారు. లయన్‌ కింగ్‌లో హీరో సింబానే. నెపోటిజం అన్యాయం అని మీరు ఫీలయితే శివుడి కొడుకు వినాయకుడిని మొక్కడం మానేయాలి. అలా చూస్తే చాలామంది దేవతలు నేపోకిడ్స్. నువ్వో కంపెనీలో బాగా కష్టపడి ఆ తర్వాత సొంతంగా కంపెనీ పెట్టి కోట్లు సంపాదిస్తే.. ఆ తర్వాత నీ పిల్లలు ఖరీదైన కార్లలో తిరిగుతారు. వాళ్ళను మిగితా వాళ్ళు చూసి నెపోకిడ్స్ అంటుంటారు. నీ పిల్లలు నెపోకిడ్స్‌ కావడానికి కష్టపడు. అంతకు మించి కావాల్సినదేముంది. నెపోటిజం.. నెపోటిజం అని అరుస్తూ సక్సెస్‌‌ అయిన వారికి దూరం కావద్దు. ఏ తండ్రి అయినా సరే తన పిల్లలకు సక్సెస్‌ను కొనివ్వలేడు. అది ఎవడికి వాడే సంపాదించుకోవాలి. సక్సెస్‌ సాధించడానికి కావాల్సింది నైపుణ్యం మాత్రమే. ఇక్కడ అందరం రేసులో ఉన్నాం. పిక్కల్లో బలం ఉన్నవాడిని ఎవ్వడూ ఆపలేడు'' అని అన్నారు పూరీ జగన్నాథ్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lpIVy7

No comments:

Post a Comment

'I'd Be Very Happy Not Being...'

'I've never done anything cliche and I've never got anything cliche.' from rediff Top Interviews https://ift.tt/U1uLrqv