Wednesday 11 November 2020

‘ఇష్టం’ హీరో ఎలా చనిపోయాడో తెలుసా?.. అతడి భార్య బ్యాక్‌గ్రౌండ్‌ మామూలిది కాదు

ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మించిన ‘ఇష్టం’ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన శ్రియ సరన్ తొలి సినిమా అది. 2001లో వచ్చిన ఆ సినిమాలో హీరోగా నటించిన చరణ్ రెడ్డి‌ మంచి గుర్తింపు దక్కించుకున్నప్పటికీ మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. కానీ పదకొండేళ్ల తర్వాత అంటే 2012, మార్చి 19న ఆయన చనిపోయాడన్న వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. చరణ్‌ రెడ్డి గుండెపోటుతో చనిపోయాడని అందరూ అనుకున్నా దాని వెనుక ఎవరికీ తెలియని ఓ విషాద గాథ ఉంది. Also Read: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ‘ఇష్టం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. హీరోయిన్ శ్రియ సరన్, విలక్షణ దర్శకుడు విక్రమ్ కె.కుమార్‌కు కూడా అదే తొలి సినిమా. అయితే ఈ చిత్రం నటీనటులకు మంచి పేరు తీసుకొచ్చినా కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. దీంతో చరణ్ రెడ్డికి ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ(‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ హీరోయిన్) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయనకు సంబంధించి ఎలాంటి విషయం బయటకు రాలేదు. కానీ ఆకస్మాత్తుగా 2012, మార్చి 19న చరణ్ చనిపోయాడన్న వార్తతో అందరూ షాకయ్యారు. అప్పటికి ఆయన వయసు 36ఏళ్లు. అప్పటికే , చరణ్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. గుండెనొప్పి రావడంతో చరణ్‌ను హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో జాయిన్ చేశారని, ఆ వెంటనే మళ్లీ గుండె నొప్పి రావడంతో చనిపోయాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆయనకు శవ పరీక్షలు చేసిన ఉస్మానియా డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించి సంచలన విషయాలు వెల్లడించారు. Also Read: మద్యానికి బానిస కావడం వల్ల చరణ్ లివర్ పూర్తిగా పాడైపోయిందని, ఆ కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయాడని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. కుటుంబ కలహాల కారణంగా చరణ్ మనోవేదనకు గురై మద్యానికి బానిసయ్యాడని, అతడిని ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోయి చనిపోయాడని బయటకు వచ్చింది. చరణ్ అక్కినేని కుటుంబానికి అల్లుడని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. తనకు సినీ అవకాశాలు లేకపోయినా, ఇతర ఇబ్బందుల్లో ఉన్నా ఎప్పుడూ ఆ ఫ్యామిలీ పేరు వాడకపోవడం ఆయన మంచితనానికి నిదర్శనమని తెలిసినవారు చెబుతుంటారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36qdkWE

No comments:

Post a Comment

'I'd Be Very Happy Not Being...'

'I've never done anything cliche and I've never got anything cliche.' from rediff Top Interviews https://ift.tt/U1uLrqv