Sunday 8 November 2020

‘సర్కారు వారి పాట’కు బయలుదేరిన మహేష్ బాబు.. ఫ్యామిలీతో ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షం!!

కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా సుమారు ఎనిమిది నెలల పాటు ఇంటికే పరిమితమైన సూపర్ స్టార్ , ఆయన కుటుంబం ఇప్పుడు విహారయాత్రకు బయలుదేరింది. మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్ - సితార విదేశీ యాత్రకు పయనమయ్యారు. ఆదివారం ఉదయం వీరు నలుగురు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమయ్యారు. కొవిడ్ టైమ్‌లో ముఖాలకు మాస్క్‌లు వేసుకోవడంతో పాటు అన్ని జాగ్రత్తలతో వారు విదేశాలకు వెళ్తున్నారు. అయితే, మహేష్ బాబు ప్రస్తుతం విహారయాత్రకు ఏ దేశానికి వెళ్తున్నారు అనే విషయంలో స్పష్టత లేదు. మహేష్ బాబు ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ సినిమాను మొదలుపెట్టాల్సి ఉంది. ఇప్పటికే దర్శకుడు పరశురామ్ తన బృందంతో కలిసి అమెరికా వెళ్లి లొకేషన్స్‌ను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇది బ్యాంక్ రోబరీ చుట్టూ తిరిగే కథ అని అంటున్నారు. చాలా వరకు అమెరికాలోనే షూటింగ్ ఉంటుందట. డిసెంబర్ లేదంటే జనవరిలో అమెరికాలో షూటింగ్ మొదలవుతుంది అని అన్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు విదేశాలకు పయనమవడం హాట్ టాపిక్‌గా మారింది. ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌లో పాల్గొనడానికే ఆయన అమెరికా వెళ్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతోంది. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్ బాబు పెట్టిన పోస్ట్. ‘‘మళ్లీ పాత రోజుల్లోకి కొత్తగా అడుగుపెట్టడానికి మాకు మేము సిద్ధమయ్యాం. విమానంలో సురక్షితంగా ప్రయాణం చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. జీవితం మళ్లీ ట్రాక్‌పైకి వచ్చింది. ఇక ముందు వెళ్లడమే’’ అని మహేష్ పేర్కొన్నారు. బండి మళ్లీ ట్రాక్‌పైకి వచ్చిందంటే సినిమా గురించేనా అనే అనుమానం కలుగుతోంది. అయితే.. ఇది మహేష్ తన భార్య, పిల్లలతో సరదాగా గడపడానికి వెళ్తోన్న వెకేషన్ ట్రిప్ అని ఇండస్ట్రీకి చెందిన కొంత మంది అంటున్నారు. ఎనిమిది నెలలపాటు తన పిల్లలు ఇంటికే పరిమితం కావడంతో ఇప్పుడు కొవిడ్ ప్రభావం కాస్త తగ్గింది కాబట్టి బయట ప్రపంచం చూపించడానికి మహేష్ తీసుకెళ్తున్నారని అంటున్నారు. కొన్ని రోజులు ఆగితే కానీ దీనిపై స్పష్టత రాదు. ఇదిలా ఉంటే, ‘సర్కారు వారి పాట’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తు్న్నారు. మహేష్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించనున్నారు. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32oExro

No comments:

Post a Comment

'We Lost So Many Things In This War'

'The war ended in 2009 and I believe the new generation of Tamils don't know what was going on there.' from rediff Top Intervi...