Sunday, 8 November 2020

రోజా లవ్ స్టోరీ రివీల్.. సెల్వమణి చేసిన పనులపై జబర్దస్త్ జడ్జ్ ఓపెన్ కామెంట్స్! భలే ట్విస్టులున్నాయే..

ఆ నాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన సినీ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై తన అందచందాలు, చలాకీతనంతో అప్పట్లో ఓ ఊపు ఊపేసిన రోజా.. ఇప్పుడు బుల్లితెరపై హవా కొనసాగిస్తూ తన పాపులారిటీ అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. మరోవైపు రాజకీయవేత్తగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అయితే తమిళ దర్శకుడు సెల్వమణిని పెళ్లాడిన రోజా.. తాజాగా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్‌లో తన లవ్ స్టోరీ బయటపెట్టడంతో ఆ ప్రేమకథ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. రోజాది ప్రేమ వివాహం అని ఇప్పటికీ కొంతమందికే తెలుసు. అయితే ఇప్పుడు అసలు విషయాలు స్వయంగా రోజానే రివీల్ చేయడంతో 20 ఏళ్ల క్రిందటి ఆమె లవ్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తన ప్రేమను గెలుచుకునేందుకు చాలా ప్లాన్స్ వేశారని తెలుపుతూ ఆయా సంగతులన్నీ చెప్పేశారు రోజా. తనకు డైరెక్ట్‌గా సెల్వమణి ఐ లవ్ యూ చెప్పలేదని, దాని వెనుక పెద్ద కథే ఉందని ఆ వివరాలు వెల్లడించారు జబర్దస్త్ జడ్జ్ రోజా. రోజాతో చాలా సినిమాలు చేసిన సెల్వమణి ఆమెనే పెళ్లాడాలని ఫిక్సయ్యారట. కానీ ఆ విషయం తనకు చెప్పకుండా ముందుగా తన తల్లిదండ్రులకు చెప్పి చాలా ట్విస్టిచ్చారని రోజా చెప్పారు. వారు ఒప్పుకున్నాకే తనకు ఐ లవ్ చెప్పారనే రహస్యాన్ని ఆమె బయటపెట్టేశారు. తాను సీతారత్నం గారి అబ్బాయి సినిమా షూటింగ్‌లో ఉండగా సెల్వమణి వచ్చి తన ప్రేమ విషయం చెప్పడమే గాక మీ ఇంట్లో వారు ఒప్పుకున్నారని చెప్పి ఆశ్చర్యపర్చారని ఆమె చెప్పుకొచ్చారు. Also Read: ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆ తర్వాత పదేళ్లకు.. అనగా 1992లో ప్రేమికులుగా మారి 2002లో రోజా- సెల్వమణి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. ఓ అమ్మాయి, అబ్బాయి. ఇటీవలే తన కూతురు అన్షుమాలిక 17వ పుట్టినరోజును ఘనంగా జరపడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అందరి చూపు రోజా కూతురు సినీ రంగ ప్రవేశంపై పడింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3paEjxZ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....